పుట్టినూరు కోసం మంత్రి ఏం చేశారు?

* మంత్రి సొంతూరు అభివృద్ధి చెందిందా?
* పారిశుధ్యం అధ్వాన్నం
* డ్రైనేజ్‌లో చెత్తాచెదారం
* అసంపూర్తిగా ఇందిరమ్మ ఇళ్లు
* ఎస్సీకాలనీ సమస్యల నిలయం
* మంత్రిగారు చదివిన పాఠశాల
* శిథిలావస్థలో స్కూల్
* ఏడు క్లాస్‌లకు రెండే గదులు
* ఆసుపత్రి లేదు
* అంగన్‌వాడి కేంద్రం లేదు
* వాటర్ ట్యాంక్ లేదు
* బస్సు సౌకర్యం లేదు
* వరదొస్తే ఊరు మునక
* కమ్యూనిటీ హాల్ కోసం డిమాండ్
* పట్టించుకోని మంత్రి
* సమస్యల వలయంలో నడవపల్లి
* సొంతూరుకు ముఖం చాటేసిన మంత్రి
వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే. మూడేళ్లలో రెండు మంత్రిత్వ శాఖలు. వెనకబడిన వర్గం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగిన నేత. ఆయనే మన రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి- విశ్వరూప్. ప్రకృతి సౌందర్యానికి పర్యాయపదం లాంటి కోనసీమ లోని ఓ కుగ్రామంలో పుట్టారాయన. మంత్రి విశ్వరూప్ సొంతూరు ఎలా ఉంటుంది? తన పుట్టినూరు కోసం మంత్రి ఏం చేశారు? ఆయన స్థాయికి తగ్గ అభివృద్ధి కనబడుతుందా? మంత్రి విశ్వరూప్ సొంతూరుపై టీవీ ఫైవ్ అందించే స్పెషల్ ఫోకస్- నా జన్మభూమి.
కోనసీమ. ఇలలో వెలసిన స్వర్గసీమ. ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. గోదారి గలగలలు.. ఏటిగట్లు... పిల్ల కాలువలతో.. ఆహ్లాదకరంగా ఉంటుందా ప్రాంతం. భూదేవికి పచ్చని పైటేసినట్టు... ఎటుచూసినా పచ్చని పంటపొలాలే. అడుగడుగునా కొబ్బరిచెట్లతో.. కేరళను తలపిస్తుంటుంది. అంతటి అందమైన కోనసీమలో పుట్టి... అసెంబ్లీకి చేరిన నేత.. పినిపే విశ్వరూప్. రాజకీయాల్లో వేగంగా ఎదిగి.. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం పశు సంవర్దక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు విశ్వరూప్.
తూర్పు గోదావరి జిల్లా.. కాట్రేనికోన మండలం.. నడవపల్లి గ్రామం.. గిడ్డి వారి పేట... మంత్రి విశ్వరూప్ జన్మస్థలం. ఏపుగా పెరిగిన కొబ్బరిచెట్ల నీడలో చల్లగా సేరదీరినట్టు ఉంటుందా గ్రామం. మంత్రి విశ్వరూప్ ఈ ఊరులోనే పుట్టారు. ఇదిగో.. ఈ ఇంట్లోనే పెరిగారు. ఆ ఇంటికి ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే చదివారు. చదువుతో పాటు రాజకీయ ఓనమాలూ ఇక్కడే నేర్చుకున్నారు. ఇంతింతై... ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగారు. విశ్వరూప్ మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన సొంతూరు "నడవపల్లి" ఆదర్శగ్రామం గా ఎంపికవడం ఆ ఊరి అభివృద్ధికి నిలువుటద్దం.
కాలువకు ఆవల ఉన్న నడవపల్లి ని మిగతా గ్రామాలతో అనుసంధానం చేస్తూ రెండున్నర కోట్ల ఖర్చుతో వంతెన ను నిర్మించారు. గ్రామంలో విస్తృతంగా సీసీ రోడ్లు వేయించారు. అయినా, ఇంకా కొన్ని వీధుల్లో మట్టిరోడ్లే దిక్కు. అవికూడా గుంతలు పడి సరిగా లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. చిన్న ఊరే కాబట్టి గ్రామానికంతటికీ సీసీ రోడ్లు వేయడం ఏమంత పెద్ద పని కాదు. మరి ఎందుకో నేటికీ ఆ ఊరులోని కొన్ని వీధులు.. ఆ అదృష్టానికి నోచుకోలేదు.. నడవపల్లి లో డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉంది.
మురుగునీరు మోరీల్లో కాకుండా వీధుల్లో పారుతోంది. ఇక డ్రైనేజ్‌లేమో చెత్తా చెదారంతో నిండిపోయి డస్ట్‌బిన్‌లా తయారయ్యాయి. మంత్రి గారు తన పరపతితో సొంతూరుకు భారీగానే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించారు. కాని, ఏళ్లు గడుస్తున్నా వాటిలో కొన్ని నేటికీ నిర్మాణం పూర్తి చేసుకోలేకపోయాయి. ఒక్కో ఇందిరమ్మ ఇంటిలో రెండు, మూడు కుటుంబాలు కలిసి కాపురం చేస్తున్న పరిస్థితి. ఎస్సీ కాలనీలో అయితే సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి.
మట్టిరోడ్లు, గుడిసెలతో కునారిల్లుతున్నారు. తమకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని మంత్రి గారిని వేడుకుంటున్నా.. నేటికీ వారి వేదన తీరనేలేదు.
నడవపల్లి లో ఒక మండల పరిషత్ పాఠశాల ఉంది. మంత్రి గారి సొంతూరులోని స్కూల్ అంటే ఏ రేంజ్‌లో ఉండాలి.. కాని ఎలా ఉందో చూడండి... రెండు రేకుల గదులు.. ఒక జారుడు బండ. పక్కా భవనం మాట దేవుడెరుగు... ఉన్న ఆ కాస్త పాఠశాలా శిథిలావస్థకు చేరింది.
పైకప్పు దూలాలు విరిగి.. ఏ క్షణమైనా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. విద్యార్థులకు కనీసం స్కూల్ యూనిఫాం కూడా అందించలేని దుస్థితి. ఉన్న రెండు క్లాస్‌రూమ్స్‌లోనే.. నానా అవస్థలు పడి ఏడోతరగతి వరకు నడిపిస్తున్నారు. మరి పై తరగతులకు ఆ ఊరి పిల్లలు ఎక్కడికెళ్లాలి? ఈ బడిలోనే చదువుకున్న విశ్వరూప్.. తన చదువుల తల్లి ఇంతగా తల్లడిల్లుతుంటే.. మంత్రిగా ఉండి ఏంచేస్తున్నారంటూ.. ఆ ఊరి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఒకప్పుడు ఆదర్శగ్రామం గా ఉన్న మంత్రి విశ్వరూప్ స్వగ్రామం.. నేడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ ఊరికి ఉన్న సౌకర్యాలకన్నా.. కావలసిన వసతులే ఎక్కువ. అసలా గ్రామంలో పెద్దగా చెప్పుకోదగ్గ సదుపాయాలేమీ లేవు. ఏ చిన్న అవసరమొచ్చినా.. పక్క ఊరికి పరుగెత్తాల్సిందే. తుమ్మొచ్చినా.. దగ్గొచ్చినా పొరుగూరే దిక్కు.
మంత్రి విశ్వరూప్ సొంతూరు నడవపల్లి లో.. ఆసుపత్రి లేదు.. అంగన్‌వాడీ కేంద్రం లేదు.. వాటర్ ట్యాంక్ లేదు... బస్సు సౌకర్యం లేదు.. ఆటోలు లేవు.. పనికి ఆహార పథకం సరిగా అమలు కాదు... ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత సమస్యలు. మొత్తానికి ఆ ఊరొక సమస్యల కుప్ప. వానలు, వరదలు వచ్చినప్పుడు ఆ ఊరు నిండా మునిగిపోతుంది. తుఫాను వస్తే కట్టుబట్టలతో మిగిలిపోతున్నారు. నేటికీ ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకోలేదు.
నడవపల్లి కి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని ఆ ఊరి ప్రజలు ఏళ్లుగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అనేక సార్లు మంత్రిగారిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. అయినా, వారి వినతులు మంత్రి చెవికెక్కింది లేదు. వారి కష్టాలు గట్టెక్కింది లేదు.
తాము అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా... ఈ ఊరి బిడ్డ మంత్రిగా ఉన్నా.. తమ కోసం చేసిందేమీ లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కొంచెం బెటర్ అని.. మంత్రి అయ్యాక ఇంతవరకు సొంతూరుకు ముఖం చూపించింది లేదని మండిపడుతున్నారు.
మంత్రి విశ్వరూప్ తన పుట్టినూరు కోసం పెద్దగా చేసిందేమీ లేదని.. కొన్ని రోడ్లు వేసినా అవి అప్పుడే దెబ్బతిన్నాయని అంటున్నారు. తామెన్ని బాధలు పడుతున్నా.. మంత్రి పట్టించుకోవడం లేదని.. ఆయన వల్ల తమకు ఒరిగిందేమీ లేదంటున్నారు ఆ ఊరి ప్రజలు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం మంత్రిగా ఉన్న విశ్వరూప్ సొంతూరు మాత్రం.. ఆయన స్థాయికి సరితూగేలా లేదనే చెప్పాలి.
కేవలం కొన్ని రోడ్లు.. మరికొన్ని ఇళ్లను చూసి అదే అభివృద్ధి అని చప్పట్లు కొట్టలేం. స్వాతంత్ర్యం వచ్చి 65ఏళ్లు అవుతున్నా.. నేటికీ నడవపల్లి కి ఆసుపత్రి కాని, బస్సు సౌకర్యం కాని లేదంటే.. అంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది. వెనకబడిన వర్గానికి ప్రతినిధిగా.. మంత్రిగా ఉన్న విశ్వరూప్ సొంతూరులో దళితులు అనేక కష్టాలు పడుతుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? మంత్రి అయ్యాక సొంతూరుకు ముఖం చాటేసిన మంత్రి.. ఇక తన జన్మభూమి రుణం తీర్చకునేదెప్పుడు?
ఆ ఊరు బాగుపడేదెన్నడు? మంత్రి గారు.. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆదర్శగ్రామంగా నిలిచిన మీ సొంతూరు.. ఇప్పుడు తమ చల్లని చూపు కోసం వేచిచూస్తోంది. విశ్వరూప్ గారు ఇప్పటికైనా స్పందించి.. మీ జన్మభూమి రుణం తీర్చుకోండి...
Published Date : Tuesday, 21/2/2012 3:33 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |