Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఉప ఎన్నికలకు సిద్ధమైన కాంగ్రెస్‌


AA

* ఏడు స్థానాలకు అభ్యర్థులు ఖరారు
* అభ్యర్థుల ఎంపికలో సీఎం, హైకమాండ్‌ ముద్ర
* గెలుపు గుర్రాలనే సెలెక్ట్‌ చేశామంటున్న బొత్స


ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్‌ సమర శంఖం పూరించింది. ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గెలుపు గుర్రాలనే రంగంలోకి దింపామని, విజయం తమదేనని భరోసాగా చెబుతున్నారు కాంగ్రెస్‌ పెద్దలు. ఐతే అభ్యర్థుల ఖరారులో సీఎం కిరణ్‌తో పాటు హైకమాండ్‌ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపాదిత లిస్ట్‌తో హస్తిన బయల్దేరిన బొత్స, అక్కడ దిగక ముందే లిస్ట్‌ రీలీజయింది.

ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ కాస్త లేటుగానైనా, లెటెస్ట్‌గా స్పందించింది. ఎన్నికలు జరగనున్న ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గ్రూపులతో రగిలిపోతున్న రాష్ట్ర కాంగ్రెస్‌కు హైకమాండ్‌ సడెన్‌గా ఝలకిచ్చింది. కొల్లాపూర్ నుంచి విష్ణువర్థన్‌రెడ్డికే అవకాశం కల్పించింది. మాజీమంత్రి చిన్నారెడ్డి రేసులో నిలిచినా.. డీకే అరుణ వాదనే నెగ్గింది. నాగర్‌కర్నూల్‌ నుంచి దామోదర్‌రెడ్డికి ఛాన్స్‌ ఇచ్చారు.

ఉత్కంఠ రేపిన మహబూబ్‌ నగర్‌లో దివంగత ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి భార్యను కాంగ్రెస్‌ పక్కనబెట్టింది. జిల్లాలోని మూడు స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికే కేటాయిస్తే రాంగ్‌ సిగ్నల్స్‌ వెళ్తాయన్న ఉద్దేశంతో ముత్యాల ప్రకాశ్‌కు ఇక్కడి నుంచి అవకాశం ఇచ్చారు. కామారెడ్డిలో పోటీకి మాజీమంత్రి షబ్బీర్ అలీ ఆసక్తి చూపకపోవడంతో యెడ్ల రాజిరెడ్డిని అదృష్టం వరించింది. ఆదిలాబాద్‌ నుంచి రాంచంద్రారెడ్డి, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రాజారపు ప్రతాప్‌ బరిలో దిగుతారు.

కోవూరులో ఆనం బ్రదర్స్‌ సూచించిన పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి వైపే అధిష్టానం మొగ్గింది. అభ్యర్థుల ఎంపికలో సీఎం కిరణ్‌ ముద్ర స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌ నుంచే ముఖ్యమంత్రి చక్రం తిప్పారన్న ప్రచారం కాంగ్రెస్‌లో జోరుగా సాగుతోంది. ఆశావహుల జాబితాతో హస్తిన పయనమైన పీసీసీ చీఫ్‌ బొత్స, అక్కడ ల్యాండవ్వకముందే లిస్ట్‌ రిలీజైంది.

ఇది బొత్సకు ఊహించని పరిణామమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఐతే బొత్స మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. గెలుపు గుర్రాలనే పార్టీ పోటీకి దింపిందని చెబుతున్నారు. అభ్యర్థులు ఎవరనే విషయం ముందే తెలుసంటున్నారు. పార్టీ శ్రేణులు కష్టపడి అందరినీ గెలిపించుకోవాలని బొత్స పిలుపునిచ్చారు.మొత్తానికి అభ్యర్థుల ప్రకటనతో ఉప ఎన్నికల సమరాంగణంలో కాంగ్రెస్ జోరును పెంచింది. త్వరలోనే ప్రచారం కూడా ప్రారంభించనుంది.

Published Date : Wednesday, 22/2/2012 11:02 AM IST
Related Articles
Gallery