Kerala: చావుకు ఎదురెళ్లిన బాలుడు.. భయం కలిగిస్తోన్న వీడియో..

Kerala: చావుకు ఎదురెళ్లిన బాలుడు.. భయం కలిగిస్తోన్న వీడియో..
Kerala: కేరళలోని కన్నూర్‌లో ఓ కుర్రాడు సైకిల్ తొక్కుతూ రోడ్డుపైకి వచ్చే ప్రయత్నం చేశాడు.

Kerala: చావు, పుట్టుకలులాంటివి మన చేతిలో ఉండవు అనేది నిజమే అయినా.. ఒక్కొక్కసారి మనం ఈ మాటను పెద్దగా పట్టించుకోము. కానీ మృత్యువు దగ్గర వరకు వెళ్లొచ్చిన వారికి ఈ మాట విలువేంటో బాగా అర్థమవుతుంది. తాజాగా కేరళలో ఓ కుర్రాడు సైకిల్‌తో పొరపాటున రోడ్డు మీదకు వచ్చాడు. ఆ తర్వాత జరిగినదంతా ఓ వీడియోలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో చూస్తుంటేనే భయానకంగా ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

కేరళలోని కన్నూర్‌లో ఓ కుర్రాడు సైకిల్ తొక్కుతూ రోడ్డుపైకి వచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే సైకిల్ తన కంట్రోల్ తప్పి వేగంగా రోడ్డుపైకి దూసుకొచ్చింది. అటువైపుగా వచ్చిన బైక్.. తన సైకిల్‌ను వేగంగా ఢీ కొట్టడంతో సైకిల్ రోడ్డుపై పడగా.. కుర్రాడు మాత్రం రోడ్డుకు అవతలి వైపు పడ్డాడు.

రోడ్డుకు అవతలి వైపు పడడంతో కుర్రాడి ప్రాణాలు క్షేమంగా ఉన్నాయి. కానీ రోడ్డుపై ఉన్న సైకిల్‌ను మాత్రం వెంటనే వచ్చిన బస్సు ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో సైకిల్ తుక్కుతుక్కయ్యింది. రోడ్డు పక్కన పడిన కుర్రాడిని గమనించి కొందరు స్థానికులు తన దగ్గరకు చేరుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ బాలుడు మరణాన్నే జయించాడు అంటూ నెటిజన్లు దీనిని షేర్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story