Bihar Beggar: అప్డేటెడ్ బెగ్గర్.. టెక్నాలజీని ఇలా కూడా వాడచ్చా..!

Bihar Beggar: అప్డేటెడ్ బెగ్గర్.. టెక్నాలజీని ఇలా కూడా వాడచ్చా..!
Bihar Beggar: బిహార్‌కు చెందిన రాజు పటేల్ అనే భిక్షగాడు బెత్తయ్యా రైల్వే స్టేషన్‌లో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నాడు.

Bihar Beggar: ఎప్పుడైతే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి అందరికీ అలవాటు అయ్యాయో.. అప్పటినుండి ఎవరి దగ్గర అంతగా క్యాష్ ఉండడం లేదు. అందుకే చిన్న చిన్న దుకాణాలు కూడా డిజిటల్ లావాదేవీలను యాక్సెప్ట్ చేస్తున్నాయి. మరి ఇలా ఉంటే భిక్షగాళ్ల పరిస్థితి ఏంటి..? అందుకే వారు కూడా డిజిటల్ అవుతున్నారు. తాజాగా బిహార్‌కు చెందిన ఓ భిక్షగాడు సరికొత్త ఐడియాతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

దాదాపు లావాదేవీలు అన్ని డిజిటల్ అయిన తర్వాత ఒకవేళ అలాంటి యాప్స్ ఉపయోగించని వారి పరిస్థితి ఏంటి అనేదానిపై చాలా ఫన్నీ వీడియోలే వచ్చాయి. అయినా ఇప్పట్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉపయోగించని వారి సంఖ్య చాలా తక్కువ అయిపోయింది. అందుకే బిహార్‌కు చెందిన 40 ఏళ్ల బెగ్గర్ కూడా అప్డేట్ అయ్యాడు. ఈ అప్డేటెడ్ బెగ్గర్ టెక్నాలజీ వాడకాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

బిహార్‌కు చెందిన 40 ఏళ్ల రాజు పటేల్ అనే భిక్షగాడు బెత్తయ్యా రైల్వే స్టేషన్‌లో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతడు ప్రధాని మోదీ మొదలుపెట్టిన డిజిటల్ ఇండియా క్యాంపెయిన్‌ను ఫాలో అవుతూ తన మెడకు ఒక క్యూఆర్ కోడ్‌ను తగిలించుకుని భిక్షాటన చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాను డిజిటల్ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేస్తానని, అది తన కడుపు నింపుకోవడానికి సరిపోతుంది అంటున్నాడు రాజు పటేల్.

Tags

Read MoreRead Less
Next Story