పెళ్ళికి తాగొచ్చిన వరుడు... మాజీ ప్రియుడితో వధువు జంప్..!

పెళ్ళికి తాగొచ్చిన వరుడు... మాజీ ప్రియుడితో వధువు జంప్..!
పెళ్ళంటే నూరేళ్ళ పంట.. రెండు మనసులతో రెండు కుటుంబాలను కలిపే అద్భుతమైన వేడుక.. అలాంటి వేడుకకి తాగి వచ్చాడు ఓ వరుడు.

పెళ్ళంటే నూరేళ్ళ పంట.. రెండు మనసులతో రెండు కుటుంబాలను కలిపే అద్భుతమైన వేడుక.. అలాంటి వేడుకకి తాగి వచ్చాడు ఓ వరుడు. దీనితో అతన్ని వదిలేసి తన మాజీ ప్రియుడితో కలిసి పారిపోయింది ఆ వధువు. ఈ ఘటన సరిగ్గా ఏడాది కింద అమెరికాలో జరగగా ఇప్పుడు వైరల్ గా మారుతుంది. మేరీల్యాండ్‌కు చెందిన 24 ఏళ్ల సేరియా సామ్‌ అనే వ్యక్తి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు.

కానీ వీరి పెళ్ళికి ఎవరు రాకపోవడంతో తన మాజీ ప్రియుడు కైల్‌ను ఆహ్వానించింది ఆమె.. అంతాబాగానే ఉంది అనుకున్న టైంలో పెళ్లి కొడుకు ఫుల్ గా తాగి వచ్చాడు. అటు ఇటు తూలుతున్నాడు. దీనిని ఆ వధువు గుర్తించింది. 'వరుడు నా ముఖంలోకి సరిగా చూడలేకపోయాడు. పెళ్లి ఉంగరాలను కూడా కింద పడేశాడు.'అని ఆమె వాపోయింది. తన బాధను తన మాజీ ప్రియుడితో పంచుకుంది.

ఆమె ఫీలింగ్స్ ని అర్ధం చేసుకున్న అతను తనతో వచ్చేందుకు సిద్ధమేనా అని అడిగేశాడు. దీనితో ఏ మాత్రం ఆలోచించకుండా ఆ వధువు తన మాజీ ప్రియుడితో పరారైంది.వెళ్తూ వెళ్తూ ఈ జంట ఒకరినొకరు కిస్‌ చేసుకుంటూ కనిపించడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story