Viral News: ఉద్యోగులకు కొత్త రూల్.. వర్కింగ్ హవర్స్‌లో అలా చేస్తే జాబ్ పోయినట్టే..!

Viral News: ఉద్యోగులకు కొత్త రూల్.. వర్కింగ్ హవర్స్‌లో అలా చేస్తే జాబ్ పోయినట్టే..!
Viral News: ఇలాంటి రూల్ చాలా కంపెనీల్లో ఉన్నా.. ఒక కంపెనీ మాత్రం ప్రత్యేకంగా దీని గురించి ఓ నోటీసు జారీ చేసింది.

Viral News: సాఫ్ట్‌వేర్ ఆఫీసుల్లో ఉండే రూల్స్ చూస్తుంటే ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని రూల్స్ వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిసినా.. కంపెనీలు మాత్రం ఎవ్వరి మాట వినేదే లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇప్పటికీ అలాంటి ఎన్నో రూల్స్ ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలాగానే ఉన్నాయి. తాజాగా అలాంటి ఒక రూల్ వైరల్‌గా మారింది.

టీచర్‌కు తెలియకుండా దొంగచాటుగా తినడం స్కూలు సమయంలో ఎంతో సరదాగా అనిపించే పని. కానీ ఆఫీస్‌కు వచ్చాక ఆ అవసరం ఉండదు. డెస్క్ దగ్గరే కూర్చొని తినే సౌలభ్యం కల్పిస్తాయి కొన్ని కంపెనీలు. కానీ చాలావరకు కంపెనీల్లో ఇదే నిషేదం. తినడానికి కేటాయించే కాంటీన్‌లాంటి స్థలాల్లోనే ఉద్యోగులు భోజనం చేయాలి. అయితే ఇలాంటి రూల్ చాలా కంపెనీల్లో ఉన్నా.. ఒక కంపెనీ మాత్రం ప్రత్యేకంగా దీని గురించి ఓ నోటీసు జారీ చేసింది.

ఫారిన్‌లోని ఓ ఐటీ కంపెనీ తమ ఉద్యోగులు వర్కింగ్ హవర్స్‌లో తినకూడదు అని రూల్ పెట్టింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. తన సహ ఉద్యోగులు కూడా ఎవరైనా తింటున్నట్టు కనిపిస్తే.. బాస్‌కు ఇన్ఫార్మ్ చేయాలని.. అలా చేస్తే.. 20 డాలర్లు అంటే రూ.1500 రివార్డ్ కూడా ఉంటుందని ప్రకటించింది. ఒకవేళ ఎవరైనా అలా తింటూ మూడుసార్లు కంటే ఎక్కువ దొరికితే.. వారిని ఉద్యోగం నుండే తీసేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కొత్త రకం వార్నింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story