Viral Video: పెళ్లిమండపంలో వరుడి వీరంగం.. పెళ్లికూతురిని కొడుతూ..

Viral Video: పెళ్లిమండపంలో వరుడి వీరంగం.. పెళ్లికూతురిని కొడుతూ..
Viral Video: ఇద్దరు వ్యక్తులు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారా లేదా అన్న విషయాన్ని వారి మొహం చూస్తే చెప్పేయవచ్చు.

Viral Video: ఈరోజుల్లో పెళ్లి గురించి ఏ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చినా అది వైరల్ అయిపోతుంది. సెలబ్రిటీలు మాత్రమే కాదు.. ఎవరైనా వారి పెళ్లికి సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేయగానే వాటికి చాలా లైకులు, షేర్‌లు వచ్చేస్తున్నాయి. అయితే మామూలుగా పెళ్లి అంటే అందరి ఫోకస్ పెళ్లికొడుకు, పెళ్లికూతురిపైనే ఉంటుంది. తాజాగా వైరల్ అయిన ఓ వీడియోలో ఉన్నట్టుండి పెళ్లికొడుకు చేసిన వీరంగానికి పెళ్లికూతురితో పాటు అందరూ షాక్ అయ్యారు.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఏ రాష్ట్రానికి చెందినవారిదో తెలియదు కానీ.. ఈ వీడియో అప్‌లోడ్ చేసిన వారికి మాత్రం మిలియన్లలో వ్యూస్ అయితే వచ్చేశాయి. అందులో అప్పటివరకు మామూలుగా ఉన్న పెళ్లికొడుకు ఒక్కసారిగా పెళ్లికూతురిని కొట్టడం మొదలుపెట్టాడు.

ఇద్దరు వ్యక్తులు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారా లేదా అన్న విషయాన్ని వారి మొహం చూస్తే చెప్పేయవచ్చు. అలాగే వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా పెళ్లికొడుకు, పెళ్లికూతురికి ఒకరంటే ఒకరికి ఇష్టం లేనట్టుగా కనిపిస్తోంది. అందుకే సరదాగా పెళ్లికొడుకును పువ్వుతో కొట్టింది పెళ్లికూతురు. దీనికి వరుడు రెచ్చిపోయి.. తనను కొట్టడం మొదలుపెట్టాడు. ఇది చూసినవారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అందులోని ఒకరు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story