Video Viral: భాగస్వామి దూరమైన బాధతో నెమలి నిశ్శబ్ధంగా..

Video Viral: భాగస్వామి దూరమైన బాధతో నెమలి నిశ్శబ్ధంగా..
Video Viral: నెమలి తన భాగస్వామిని విడిచిపెట్టడానికి ఇష్టపడడంలేదు అని మిస్టర్ కస్వాన్ ట్వీట్ చేశారు.

Video Viral: భావ వ్యక్తీకరణ మనుషుల్లోనూ జంతువుల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. తన భాగస్వామిని కోల్పోయిన నెమలి.. తన నెచ్చెలి తననుంచి దూరమైన విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది.. తిరిగి రాదని తెలిసి దాని వెనుకే నిశ్శబ్ధంగా నడుచుకుంటూ వెళుతోంది..

మనుషులైతే మరొకరికి చెప్పుకుని బాధపడతారు.. మరి పక్షులు, జంతువులు.. వాటిక్కూడా మనుషుల్లానే మనసుంటుంది.. స్పందించే గుణం ఉంటుంది.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియో మరోసారి ఈ విషయాన్ని నిరూపించింది.

నాలుగేళ్లపాటు తన భాగస్వామితో కలిసి జీవించిన నెమలి చనిపోయిన తర్వాత దానిని వదలడానికి నిరాకరించినట్లు వీడియోలో ఉంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ టచింగ్ వీడియోను పంచుకున్నారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని కుచెరా పట్టణంలో జరిగింది. నెమలి తన భాగస్వామిని విడిచిపెట్టడానికి ఇష్టపడడంలేదు అని మిస్టర్ కస్వాన్ ట్వీట్ చేశారు.

19 సెకన్ల నిడివి గల ఈ వీడియోను దాదాపు 1.26 లక్షల మంది వీక్షించారు. వీడియో చూసిన నెటిజన్లు హృదయానికి హత్తుకునేలా ఉందని అన్నారు. మనుషులైనా, జంతువులైనా తమ జీవిత భాగస్వామితో గడిపిన క్షణాలను మరిచిపోవడం చాలా కష్టం అని మరొక నెటిజన్ ట్వీట్ చేశారు.

జంతువులు ఎలా ప్రవర్తిస్తాయో మానవులకు తెలియజేసేందుకు వన్యప్రాణుల వీడియోలను కస్వాన్ తరచుగా షేర్ చేస్తుంటారు.

Tags

Read MoreRead Less
Next Story