చీమలు ఎలా శానిటైజ్‌ చేసుకుంటాయో‌ తెలుసా..?

చీమలు ఎలా శానిటైజ్‌ చేసుకుంటాయో‌ తెలుసా..?
గత ఆరునెలలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం.. వైరస్ కట్టడికి..

గత ఆరునెలలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం.. వైరస్ కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అన్నట్టుగా పరిస్థితి ఉంది. ప్రస్తుతం వివిధ దేశాల్లో కరోనా వ్యాక్సిన్ లు ప్రయోగ దశలోనే ఉన్నాయి. ఈ క్రమంలో కేసులు మాత్రం రోజురోజుకు పెరుగుతూ ప్రజల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కరోనా రాకుండా భౌతికదూరం పాటిస్తూ.. మాస్కులు ధరిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయితే ఇలాంటి అంటూ వ్యాధులు ప్రబలినప్పుడు చీమలు మనుషులకన్నా తెలివిగా ఆలోచిస్తాయట. చీమల గుంపులో ఏ చీమకైనా వ్యాధి సోకితే ముందస్తుగా నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేస్తాయట.

భూమిపై ఉన్న అనంత శతకోటి జీవ రాశుల్లో 15-20శాతం చీమలే ఉంటాయని పరిశోధకులు చెబుతుంటారు. ఇవి కూడా మనుషుల్లాగే జీవనం సాగిస్తుంటాయి. అన్ని చీమలు కలిసిమెలిసి ఉంటూ జీవించడానికి ఓ గూడు ఏర్పాటు చేసుకుంటాయి. అయితే కొన్ని చీమలు గుంపులుగా ఏర్పడి పెద్ద పెద్ద గూళ్ళను ఏర్పాటు చేసుకుంటాయి.. వాటినే మనం పుట్టలుగా పిలుస్తుంటాం.. అయితే పుట్టలలో మాత్రం తక్కువగా జీవిస్తుంటాయట.. అయితే చీమలకు అంటువ్యాధులు వచ్చినప్పుడు మాత్రం ముందస్తు జాగ్రత్త చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. వ్యాధి సోకిన సమయంలో చీమల సమూహం తీరులో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని పరిశోధకులు అంటున్నారు.

ఆ సమయంలో వ్యాధి భారిన పడిన చీమలు భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటిస్తాయట. అలాగే కొత్త సమూహంలో కలవడానికి చీమలు పెద్దగా ఇష్టపడని పరిశోధనలో భాగంగా తేలింది. పరిశోధకులు 11 చీమల సమూహాలపై వ్యాధికారకాలను వదిలారు. దీంతో ఒక సమూహంలోని చీమలు.. మరో సమూహంలోని చీమలను కలవలేదు. ఇలా ఒక సమూహం మరో సమూహాన్ని కలవకపోవడం వల్ల వ్యాధి వ్యాప్తి పూర్తిస్థాయిలో తగ్గిందని గుర్తించారు. అంతేకాకుండా వ్యాధి కారకాలు ఎంత తక్కువగా ఉంటే వ్యాధి సోకే అవకాశాలు అంత తక్కువగా ఉంటాయన్న విషయాన్ని చీమలు గుర్తుపెట్టుకుంటాయని తేల్చారు. అందుకే ఇతర సమూహంలోని చీమలను కలవడానికి ఇష్టపడవని కనిపెట్టారు. అలాగే సొంత సమూహంలోని చీమలతో కూడా సంబంధాలను తగ్గించేస్తాయని ఈ పరిశోధనలో కనుగొన్నారు. మనం మనుషులం కాబట్టి వ్యాధిగ్రస్తుల్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుంటాం.. కానీ చీమలు మాత్రం సమూహంలో ఏ ఒక్క చీమకైనా వ్యాధిసోకితే దానిని నిర్దాక్షిణ్యంగా బయటకు వెళ్లగొట్టడమో.. చంపటమో చేస్తాయట. అందువల్ల రోగం మరొక చీమకు రాకుండా ఇలా కఠినంగా వ్యవహరిస్తాయట.

మాములుగా మనం బయటకి వెళ్లిరాగానే మన చేతులు కాళ్ళు కడుక్కుంటాం.. ఇంకా చెప్పాలి అంటే కొందరు శుభ్రంగా తమ చేతుల్ని శానిటైజ్‌ చేసుకుంటారు. ఆహరం కోసం అలాగే చీమలు కూడా బయటకు వెళ్లి గూటికి తిరిగి చేరుకోగానే శానిటైజ్‌ చేసుకొని లోపలికి వెళ్తాయట. ఇదెలా జరుగుతుందని అనుకుంటున్నారా? చీమలలో ఫార్మిక్‌ యాసిడ్‌ అనే రసాయనం ఉంటుంది. దీని అవి వదులుతుంటాయి. దాంతో ఇది యాంటీమైక్రోబయల్‌ రసాయనంగా పనిచేస్తుంది. ఇలా ఒకచీమపై మరొక చీమపై ఫార్మిక్‌ యాసిడ్‌ను చల్లుకుంటాయి. దీని వల్ల చీమలపై ఉండే వ్యాధికారక క్రిములు నశిస్తాయి.. తద్వారా అవి ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాయి.

Tags

Read MoreRead Less
Next Story