Anand Mahindra: ఏం ఐడియా గురూ.. ఇడ్లీ ఇలా కూడా చేస్తారా: ఆశ్చర్యంలో ఆనంద్ మహీంద్రా..

Anand Mahindra: ఏం ఐడియా గురూ.. ఇడ్లీ ఇలా కూడా చేస్తారా: ఆశ్చర్యంలో ఆనంద్ మహీంద్రా..
Anand Mahindra: చిన్నప్పుడెప్పుడో చీకిన పుల్ల ఐస్ గుర్తొస్తోంది ఈ ఇడ్లీలు చూస్తుంటే.

Anand Mahindra:చిన్నప్పుడెప్పుడో చీకిన పుల్ల ఐస్ గుర్తొస్తోంది ఈ ఇడ్లీలు చూస్తుంటే. 'సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా' అని పిలవబడే బెంగళూరులో ఒక కొత్త ఆవిష్కరణ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను ఆశ్చర్యపరిచింది. మహీంద్రా ట్విట్టర్‌లోకి వెళ్లి, నగరాన్ని 'ఇండియాస్ ఇన్నోవేషన్ క్యాపిటల్' అని ప్రశంసించారు.

ఆనంద్ మహీంద్రాను ఆశ్చర్యపరిచిన ఈ తాజా ఆవిష్కరణ పుల్ల ఇడ్లీ. సాంబార్, చట్నీతో స్టిక్ ఇడ్లీ వడ్డించిన తీరు ఆయన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. స్పూన్‌తో పని లేకుండా ఇడ్లీని సాంబార్‌లో డిప్ చేసుకుని హ్యాపీగా తినేయొచ్చు.

ఇడ్లీ డిష్‌కు సంబంధించిన చిత్రాన్ని పంచుకుంటూ, మహీంద్రా ఇలా రాసుకొచ్చారు. సృజనాత్మకతకు కొలమానం ఏముంటుంది. ఎవరు చేసినా మెచ్చుకోవలసిందే. అసలు ఇలాంటి ఐడియా రావడమే గ్రేట్ అంటూ పుల్ల ఇడ్లీ తయారు చేసిన వారిని ఫుల్లుగా మెచ్చుకున్నారు.

ఈ ఇడ్లీపై మీ అభిప్రాయం తెలపండి అంటూ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో 8.5 మిలియన్లకు పైగా ఉన్న యూజర్లను సరదాగా ప్రశ్నించారు ఆనంద్ మహీంద్రా.

యూజర్లు భిన్న అభిప్రాయాలతో స్పందించారు. ఒకరు బావుందంటే మరొకరు ఇడ్లీని చేత్తో తినడం సంప్రదాయం అని చెప్పారు. వాటర్ వేస్టవదు.. నీటితో పన్లేదు.. చేతులు కడుక్కోవక్కర్లేదు.. స్టిక్ ఇడ్లీ ఐడియా అదిరింది గురూ అని చాలా మంది యూజర్లు ప్రశంసిస్తున్నారు.

Bengaluru, India's innovation capital can't stop its creativity from manifesting itself in the most unexpected areas… Idli on a stick—sambhar & chutney as dips…Those in favour, those against?? pic.twitter.com/zted3dQRfL

Tags

Read MoreRead Less
Next Story