Viral Video: తల్లి ప్రేమ.. మొసలి నుండి బిడ్డను రక్షించి తాను మాత్రం..

Viral Video: తల్లి ప్రేమ.. మొసలి నుండి బిడ్డను రక్షించి తాను మాత్రం..
Viral Video: తల్లి జింక కోసం చూస్తోంది.. అమ్మ ఇక రాదని ఆ చిన్నారి జింకకు ఇంకా తెలియదు

Viral Video: అమ్మ ప్రేమ అందరిలో ఒకేలా ఉంటుంది.. అది మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా.. కనిపెంచిన బిడ్డని కళ్ల ముందే మొసలి చంపడానికి ప్రయత్నిస్తుందని తెలిసి బిడ్డను తప్పించి మొసలి నోటికి తను ఆహారం అయింది తల్లి జింక.

ఈ వైరల్ వీడియోలో మొసలి నుండి బిడ్డను రక్షించడానికి తల్లి జింక తనను తాను త్యాగం చేసింది. నెటిజన్లు ఈ వీడియో చూసి ఉద్వేగానికి లోనవుతున్నారు. ఈ హృదయ విదారక వీడియోలో ఒక జింక నదిలో ఈత కొడుతుండగా, దానిని వేటాడేందుకు ఒక మొసలి దాని వైపుకు వస్తోంది.

తల్లి జింకలు తమ సంతానాన్ని రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాయి. సాధారణంగా పిల్ల జింకలకు (పాన్‌లు) రెండేళ్ల వయస్సు వచ్చే వరకు తల్లి సంరక్షణలోనే ఉంటాయి.

తల్లి జింక తన చిన్నారులను ఎంతగా ప్రేమిస్తుందో తెలిపే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 6న ఐఏఎస్ అధికారిణి సోనాల్ గోయెల్ ట్విటర్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఇది ఇప్పటివరకు 124 వేల మంది చూడగా 8వేల లైక్‌లను అందుకుంది.

ఈ వీడియోలో ఒక జింక నదిలో ఈత కొడుతుండగా, దానిని వేటాడేందుకు ఒక మొసలి దాని వైపుకు వస్తోంది. ఇది చూసిన తల్లి జింక వెంటనే నీటిలోకి దూకి తన బిడ్డ ప్రాణాలను కాపాడడానికి వేగంగా ఈదుతుంది. మొసలి ముందు ఈత కొడుతున్నప్పుడు తల్లి తన వేగాన్ని తగ్గించింది. నా బిడ్డను వదిలి నన్ను తిను అని చెబుతున్నట్టు ఉంది తల్లి జింక పరిస్థితి.

జింక పిల్ల ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటుంది. తల్లి జింక కోసం చూస్తోంది.. అమ్మ ఇక రాదని ఆ చిన్నారి జింకకు ఇంకా తెలియదు. జింక ప్రాణత్యాగం చేయడం నెటిజన్లను కంటతడి పెట్టించింది.

"తల్లి ప్రేమను ఏ పదాలు వర్ణించలేవు. తల్లి జింక తన బిడ్డను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన హృదయ విదారక వీడియో ఇది. తల్లిదండ్రులను విస్మరించ రాదని ఈ వీడియో మాకు గుర్తుచేస్తుందని వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. తల్లిదండ్రులను గౌరవించండి. మీ వంతు వచ్చినప్పుడు వారిని జాగ్రత్తగా చూసుకోండి" అని ఐఏఎస్ అధికారిణి వీడియోతో ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story