ప్రముఖ హాస్య నటుడు వివేక్‌ అకాల మరణం కోలీవుడ్ సినీరంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

Actor Vivek

నటనపైన మాత్రమే కాదు... వివేక్‌ మంచి ప్రకృతి ప్రేమికుడు కూడా. పర్యావరణ పరిరక్షణకోసం నిరంతరం ఆయన పాటుపడేవారు.

Actor Vivek

వివేక్‌.. తనకు గురువు మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్‌ కలాం అని పలు సందర్బాలలో చెప్పుకొచ్చారు.

Actor Vivek

కలాం కోరిక మేరకు గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారంతోపాటు, చెట్ల పెంపకాన్ని తన జీవిత మిషన్‌గా చేపట్టారయన. తన వంతు బాధ్యతగా కోటి చెట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Actor Vivek

ఇందులోభాగంగా 2011 లో భారీ చెట్ల పెంపకం కోసం ‘గ్రీన్ కలాం’ ప్రాజెక్టును వివేక్ ప్రారంభించారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే 33.23 లక్షల మొక్కలు నాటారు.

Actor Vivek

Actor Vivek

Actor Vivek