నారప్పలో వెంకటేశ్‌ ప్రేయసిగా కనిపించే ఈ హీరోయిన్ అసలు పేరు అమ్ము అభిరామి
అభిరామి స్వస్థలం తమిళనాడు.. చెన్నైలో పుట్టి పెరిగిన ఆమె చిన్ననాటి నుంచే సినిమాల్లో నటించింది.
17 ఏళ్లకే వెండి తెరపై ఎంట్రీ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంది.
2017లో విజయ్‌ 'భైరవ' సినిమాలో మెడికల్‌ కాలేజీ స్టూడెంట్‌గా కనిపించింది
తమిళ 'రాచ్చసన్‌', తెలుగు 'రాక్షసుడు' చిత్రాల్లో హీరో బెల్లంకొండ శ్రీను మేనకోడలి పాత్రలో నటించింది.
జగపతి బాబు నటించిన FCUK(ఫాదర్‌ ఆఫ్‌ చిట్టి ఉమా కార్తీక్‌)లోనూ ఉమ పాత్రలో అలరించింది.
ప్రస్తుతం ఈ కన్నమ్మ మణిరత్నం తెరకెక్కిస్తున్న నవరస సినిమాలో నటిస్తుంది.
ఇంటస్ట్రీకి వచ్చిన నాలుగేళ్లలోనే విష్ణు విశాల్, కాశీ వెంకట్, విక్రమ్ ప్రభు, బాలా శరవణన్, ఆర్జే షా వంటి ప్రసిద్ద నటులతో ఆమె నటించింది.