ఇక నుంచి పాటలు వినాలంటే ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్‌తో పని లేదు.. నొవెటో ఎన్1 ఉంటే చాలు.. ఇదో మినీ సౌండ్‌బార్ లాంటి పరికరం. దాని ఎదురుగా కూర్చుంటే చాలు.. అల్ట్రాసౌండ్ తరంగాల ద్వారా పాట మీ చెవులకు చేరుతుంది.
ఇముజక్ 3డీ స్టీరింగ్ వీల్ డిస్‌ప్లే.. స్టీరింగ్‌లో అమర్చిన 2.8 అంగుళాల తెర సాయంతో ఇది పనిచేస్తుంది. కారులో వెళుతున్నప్పుడు చుట్టుపక్కల హోటల్స్, ఏటీఎం, పెట్రోల్ బంక్ వంటి వాటి గురించిన ముందస్తు సమాచారం మనకు అందుతుంది.
గురక సమస్య నుంచి బయటపడేసే స్మార్ట్ దిండు. దీనిలో అమర్చిన ఆల్గోరిథమ్ మనం నిద్రపోతున్నప్పుడు పడుకున్న తీరును గుర్తించి పనిచేస్తుంది. శ్వాసమార్గం వెడల్పై గురకను తగ్గిస్తుంది. ఉదయం నిద్ర లేచాక ఎలా పనిచేసింది తెలుసుకోవచ్చు కూడా.
మన ఆలోచనలే మన పని తీరును తెలియజేస్తాయనుకుంటాము. కానీ మనం చెవుల్లో పెట్టుకున్న హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ కూడా తాకే పనిలేకుండా ఆలోచనల ద్వారానే సౌండ్ తగ్గించే ఏర్పాటు ఉంది ఐసియర్ సంస్థ రూపొందించిన హెడ్‌ఫోన్స్‌కి.
బ్యాటరీలను కూడా ఛార్జ్ చేయొచ్చు.. రిమోట్‌లో విద్యుత్‌ని నియంత్రించే చిప్ ఉంటుంది. ఇది రేడియో ఫ్రీక్వెన్సీలను విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఇది రిమోట్‌లో ఉన్న బ్యాటరీలను నిరంతరం ఛార్జ్ చేస్తుంది.
ముందస్తు జబ్బుల గురించి హెచ్చరించే యాప్ టోటో కంపెనీ రూపొందించి వెల్‌నెస్ టాయ్‌లెట్. ప్రత్యేక సెన్సర్లు సంబంధిత యాప్‌నకు చేరవేస్తాయి. మంచి ఆహారం తీసుకోమని హెచ్చరిస్తుంది.
కాఫీ మేకర్ మాదిరిగానే ఐస్‌క్రీమ్ మేకర్ కూడా.. ఐస్‌క్రీమ్‌కు సంబంధించిన పదార్ధాలన్నీ అందులో వేస్తే రెండు నిమిషాల్లో మీ ముందుకు కూల్ ఐస్‌క్రీమ్ వచ్చేస్తుంది.
మానసిక ఒత్తిడి మనుషుల్ని కృంగదీస్తుంది.. ఫీల్‌మోర్ సంస్థ రూపొందించిన ఈ కోవె హెడ్ బ్యాండ్ పెట్టుకుంటే ఒత్తిడి పారిపోతుంది.. దీన్ని రోజుకు ఒకటి రెండు సార్లు 20 నిమిషాలు పెట్టుకుంటే మంచి నిద్ర పట్టి ఒత్తిడి తగ్గుతుంది.