మహిళలను సెక్స్‌ బానిసలుగా మారుస్తున్న తాలిబన్లు...!

మహిళలను సెక్స్‌ బానిసలుగా మారుస్తున్న తాలిబన్లు...!
అఫ్గానిస్థాన్‌లో అధికార పగ్గాలు చేపట్టకముందే తాలిబన్ల అరాచకాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి.

అఫ్గానిస్థాన్‌లో అధికార పగ్గాలు చేపట్టకముందే తాలిబన్ల అరాచకాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రకటించిన తాలిబన్లు... ఇప్పుడు హెరాత్ ప్రావిన్స్‌లోని విశ్వవిద్యాలయాల్లో కో-ఎడ్యుకేషన్‌పై నిషేధం విధించారు. సమాజంలో అన్ని చెడులకూ మూలం కో-ఎడ్యుకేషన్‌ అంటున్నారు తాలిబన్లు. యూనివర్శిటీ ఫ్రొఫెసర్లు, ప్రైవేటు వర్సిటీ యాజమానులు, తాలిబన్ నేతలతో 3 గంటలపాటు జరిగిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు అఫ్గాన్‌లోని ఖామా అనే న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. గతవారం అఫ్గాన్‌ను పూర్తిగా ఆక్రమించిన తర్వాత తాలిబన్లు జారీ చేసిన తొలి ఫత్వా ఇదేనని పేర్కొంది.

కో-ఎడ్యుకేషన్‌పై నిషేధం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదంటున్నారు అఫ్గానిస్థాన్‌ ఉన్నత విద్యాధికారులు. మహిళా ఆచార్యులను మహిళా విద్యార్థుల బోధనకు మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. అఫ్గానిస్థాన్‌లో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న కో-ఎడ్యుకేషన్‌ విధానానికి ఇక తెరపడనుంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపై పెద్దగా ప్రభావం ఉండకపోయినా, ఇప్పటికే మహిళా విద్యార్థుల సంఖ్యపై ఇబ్బంది పడుతున్న ప్రైవేటు వర్సిటీలకు దెబ్బగా భావిస్తున్నారు. ప్రస్తుతం హెరాత్‌లోని విశ్వవిద్యాలయాల్లో 40వేల మంది విద్యార్థులు, 2వేల మంది ఆచార్యులు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story