Afghanistan: బ్యాంకుల్లో 'నో క్యాష్'.. ఏటీఎంల వద్ద జనం క్యూ..!

Afghanistan: బ్యాంకుల్లో నో క్యాష్.. ఏటీఎంల వద్ద జనం క్యూ..!
Afghanistan: మరోవైపు ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులు.. దాంతో అక్కడ ప్రజానీకం వణికిపోతుంది.

Afghanistan: ఆఫ్గన్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్గన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రోజురోజుకీ ప్రజల జీవనం దారుణంగా మారిపోతుంది. ఒకవైపు తాలిబన్లు ఎప్పుడేం చేస్తారో అనే భయం .. మరోవైపు ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులు.. దాంతో అక్కడ ప్రజానీకం వణికిపోతుంది. ఆ దేశంలో మహిళలు, చిన్నారుల పరిస్థితి హృదయ విదారకంగా మారింది. కొందరు జవాన్లు మానవతా దృక్పథంతో చిన్నారులకు సాయం చేస్తున్నారు. ఆర్నెళ్లుగా అందని వేతనాల కోసం వందలాది మంది ఉద్యోగులు బ్యాంకుల ముందు క్యూ కట్టిన దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఆఫ్గానిస్థాన్ లోని న్యూ కాబుల్‌ బ్యాంకు ముందు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు చెల్లించాలని ఆందోళనకు దిగారు. గత మూడు నుంచి ఆర్నెళ్ల పాటు పెండింగ్‌లో ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు సామాన్యులు ఏటీఎంల వద్ద డబ్బులుడ్రా చేసుకొనేందుకు పడిగాపులు కాస్తు్న్నారు. మూడు రోజుల క్రితం బ్యాంకులు పునఃప్రారంభమైనప్పటికీ ఖాతాదారులు ఎవరూ తమ డబ్బులు డ్రా చేసుకోలేక పోతున్నారు. అయితే బ్యాంకుల్లో నగదు లేదని సిబ్బంది చెబుతున్నారు. ఏటీఎంలలో నగదు ఉపసంహరణపై పరిమితి విధించడంతో..ప్రజలు తిప్పలు పడుతున్నారు. ఏటీఎం సెంటర్ల వద్ద జనం భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు.


Tags

Read MoreRead Less
Next Story