Putin and Gamble Hadley: ఇక్కడ అనసూయ vs కోట.. అక్కడ గ్యాంబుల్ vs పుతిన్.. మహిళల డ్రెస్సింగ్‌పై..

Putin and Gamble Hadley: ఇక్కడ అనసూయ vs కోట.. అక్కడ గ్యాంబుల్ vs పుతిన్.. మహిళల డ్రెస్సింగ్‌పై..
Russia: ఏ దేశం అయినా, ఏ ప్రాంతం అయినా మహిళల డ్రెస్సింగ్ మీద కామెంట్ చేసేవారు తక్కువేమీ లేరు.

Russia: ఏ దేశం అయినా, ఏ ప్రాంతం అయినా మహిళల డ్రెస్సింగ్ మీద కామెంట్ చేసేవారు తక్కువేమీ లేరు. మహిళలు అలాంటి బట్టలు వేసుకుంటే అందరూ అలాగే చూస్తారని.. అసలు అలాంటి బట్టలు వేసుకోవాల్సిన అవసరం ఏంటి అని కామెంట్ చేసేవారిని మనం రోజూ చూస్తూనే ఉంటాం. ఇటీవల సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు.. యాంకర్ అనసూయ డ్రెస్సింగ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా రష్యాలో కూడా ప్రెసిడెంట్ పుతిన్‌.. తనను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్‌ను కామెంట్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి.

మాస్కోలోని ఎనర్జీ ఫోరమ్‌లో రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమర్‌ పుతిన్‌ పాల్గొన్న సెషన్‌కు ఓ టీవీ ఛానెల్ ఉద్యోగిని అయిన హాడ్లీ గ్యాంబుల్ మోడరేటర్‌గా ఉన్నారు. యూరోప్‌లో ఏర్పడ్డ గ్యాస్ సంక్షోభం గురించి చర్చించడానికి ఈ సెషన్ నిర్వహించారు. అయితే సెషన్ జరుగుతుండగానే పుతిన్.. గ్యాంబుల్‌ను ఉద్దేశించి.. అందంగా ఉంది, ప్రెట్టీగా ఉందని ప్రశంసించారు. ప్రెసిడెంట్ అయ్యుండి అలాంటి ఒక పబ్లిక్ సెషన్‌లో అలా ఎలా మాట్లాడతారని తనపై విమర్శలు మొదలయ్యాయి.

విమర్శలు ఎక్కువవుతుండడంతో పుతిన్ ప్రచారకుడు వ్లాదిమిర్ సోలోవియోవ్.. పుతిన్‌ను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. సోలోవియోవ్‌కు రోసియా 1 అనే న్యూస్ ఛానల్‌ ఉంది. హాడ్లీ గ్యాంబుల్‌, పుతిన్‌ మధ్య జరిగిన ఇంటర్వ్యూను అందులో టెలికాస్ట్ చేశారు. దీనిలో గ్యాంబుల్‌.. పుతిన్‌ దృష్టి మరల్చడానికి అన్ని విధాలుగా ప్రయత్నించిందని ఆరోపించారు సోలోవియోవ్‌. అంతే కాకుండా తన కాళ్లపై ఫోకస్ చేస్తూ.. గ్యాంబుల్ కావాలనే పుతిన్‌తో మాట్లాడుతున్నప్పుడు తన కాళ్లను ముందుకు వెనక్కి ఆడించిందన్నారు.

సోలోవియోవ్ ఈ ఫుటేజ్‌ను విడుదల చేసిన తర్వాత రష్యా మీడియా తనకు మద్దతుగా గొంతు విప్పింది. హాడ్లీ గ్యాంబుల్‌ చర్యలు సరికాదంటూ విమర్శించింది. ''హాడ్లీ ఈ పనుల ద్వారా తనను తాను ఒక సెక్స్‌ ఆబ్జెక్ట్‌గా ప్రదర్శించుకుంది. పుతిన్‌ దృష్టిని మరల్చాలని విఫల యత్నం చేసింది'' అంటూ మండిపడుతోంది. ఈ విషయం గురించి వారు ఇరువురు పెద్దగా స్పందించలేదు.

మీడియా అంతా పుతిన్‌కు సపోర్ట్ చేస్తూ గ్యాంబుల్‌ను విమర్శిస్తుంటే సోషల్ మీడియాలో మాత్రం సపోర్ట్ అంతా గ్యాంబుల్‌కే ఉంది. ఒక జర్నలిస్ట్ ఎవరినైనా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇలాగే ప్రవర్తించాలని రూల్ ఏం లేదని నెటిజన్ల వాదన. ఒకవేళ గ్యాంబుల్ నిజంగానే పుతిన్ దృష్టిని మరల్చాలనుకున్నా మీ ప్రధాని మరీ అంత బలహీన మనస్తత్వం కలవాడా అని ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా యూజర్లు. మొత్తానికి ఈ ఘటన చినికి చినికి గాలి వానగా మారింది.

ఇక్కడ యాంకర్ అనసూయపై కోట శ్రీనివాసరావు కామెంట్స్ ఎంత వైరల్ అయ్యాయో అక్కడ గ్యాంబుల్‌పై పుతిన్ కామెంట్స్ అంతే వైరల్ అయ్యాయి. దేశం మారినా, భాష వేరైనా.. కొంతమంది మగవారి బుద్ధి ఇలాగే ఉంటుందా? అన్న విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story