అఫ్గనిస్తాన్‌లో అల్లకల్లోలం.. ఎయిర్‌పోర్ట్‌లో ఐదుగురు మృతి..!

అఫ్గనిస్తాన్‌లో అల్లకల్లోలం.. ఎయిర్‌పోర్ట్‌లో ఐదుగురు మృతి..!
పూర్తిగా తాలిబన్ల వశమైన అఫ్గనిస్తాన్‌లో ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీతో పాటు పలువురు మంత్రులు ఇప్పటికే దేశాన్ని విడిచివెళ్లారు.

పూర్తిగా తాలిబన్ల వశమైన అఫ్గనిస్తాన్‌లో ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీతో పాటు పలువురు మంత్రులు ఇప్పటికే దేశాన్ని విడిచివెళ్లారు. అఫ్గనిస్థాన్‌ తాత్కాలిక ప్రెసిడెంట్‌గా తాలిబన్ల చీఫ్‌ అబ్దుల్‌ ఘనీ సారధ్యంలో మొత్తం అధికార మార్పిడి ప్రక్రియ జరుగుతోంది.

అటు.. తాలిబన్ల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం కోసం... జనం పరుగులు తీస్తున్నారు. విదేశాలకు పారిపోయి తలదాచుకునేందుకు కాబూల్‌ విమానాశ్రయం చేరుకుంటున్నారు. వీసాలు, తనీఖీల్ని పట్టించుకోకుండా ప్రజలు తోసుకుంటూ ఎయిర్‌పోర్ట్‌లోకి చొచ్చుకు వెళ్లారు. విమానం రన్‌వే పైకి రాకముందే అటు వైపు పరుగులు పెట్టారు. జనం ఉరుకులు, పరుగులు, తోపులాటలతో ఎటుచూసినా గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి. ఏదో రకంగా ఫ్లైట్‌లో ఆన్‌బోర్డ్‌ అయ్యేందుకు నిచ్చెన పైనుంచి పాకుతున్న దృశ్యాలు అక్కడి దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. విమానం ఏ దేశానికి వెళ్తోందనేది పట్టించుకోకుండా.. ఆఫ్గన్ నుంచి ప్రాణాలతో బయటపడితే చాలని భావిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం అత్యంత దారుణంగా మారడంతో కాబుల్‌ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేశారు. Spot

కాబూల్‌లోకి ప్రవేశించిన తాలిబన్లు వరుసగా అన్ని ఇళ్లను జల్లెడ పడుతున్నారు. ప్రజల వద్ద ఉన్న కార్లు లాక్కుంటున్నారు. పరిస్థితులు క్షణక్షణానికీ భయంకరంగా మారుతుండడంతో దేశం విడిచి వెళ్లేందుకు వేలాది మంది ప్రయత్నం చేస్తున్నారు. వేలాదిమంది శరణార్థులుగా వలసవెళ్లారు. ఎయిర్‌పోర్ట్‌కు తరలివస్తున్న వారిని కంట్రోల్ చేసేందుకు US బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాల్సి వచ్చిందంటే ఎంత అరాచకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అటు, ఎయిర్‌పోర్ట్‌కి వాహనాలతో రద్దీ ఒక్కసారిగా పెరగడంతో.. అటువైపు వెళ్లే దారుల్లో పూర్తిగా ట్రాఫిక్‌ జామ్‌తో అయ్యింది. ఫ్లైట్ సర్వీస్‌లు నిలిపేసిన విషయం తెలియక.. నానా కష్టాలు పడి అక్కడికి చేరుకున్న వారంతా తమ భవిష్యత్ ఏంటో తెలియక అయోమయంలో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story