Joe Biden : తాలిబ‌న్లకు జో బైడెన్‌ బిగ్ షాక్... !

Joe Biden : తాలిబ‌న్లకు జో బైడెన్‌ బిగ్ షాక్... !
తాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. అమెరికా బ్యాంకుల్లోని అఫ్గన్‌కు సంబంధించిన నిధులను ఫ్రీజ్‌ చేస్తున్నట్టుగా బైడెన్‌ సర్కారు ప్రకటించింది.

తాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. అమెరికా బ్యాంకుల్లోని అఫ్గన్‌కు సంబంధించిన నిధులను ఫ్రీజ్‌ చేస్తున్నట్టుగా బైడెన్‌ సర్కారు ప్రకటించింది. యుఎస్ ట్రెజరీ ఫెడరల్ రిజర్వ్, ఇతర అమెరికా బ్యాంకుల్లోని ఆఫ్ఘాన్‌ నిధులపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 9.5 బిలియన్‌ డాలర్ల మేర నిధులను నిలిపివేసింది. యునైటెడ్ స్టేట్స్‌లో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి చెందిన ఆస్తులు తాలిబాన్లకు అందుబాటులో ఉండవు అని పరిపాలన అధికారి ఒకరు మీడియాకి వెల్లడించారు. అంతేకాకుండా బైడెన్‌ అడ్మినిస్ట్రేషన్ తాలిబాన్ల పై ఒత్తిడి చేయడానికి ఇతర చర్యలను కూడా ఆలోచిస్తోందని చెప్పారు. కాగా ఇప్పటికే జర్మనీ డెవలప్‌మెంట్‌ నిధులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అఫ్గన్‌ కరెన్సీ అఫ్గని రికార్డు నష్టాలను చవిచూస్తోంది.. మంగళవారం నాటికి 4.6 శాతం పడిపోయి డాలర్‌కు 86.0625 స్థాయికి చేరింది.

Tags

Read MoreRead Less
Next Story