Omicron in USA: చిన్నారులను వదిలిపెట్టని ఒమిక్రాన్.. 30 కోట్లు దాటిన కేసులు

Omicron in USA: చిన్నారులను వదిలిపెట్టని ఒమిక్రాన్.. 30 కోట్లు దాటిన కేసులు
Omicron in USA: శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం అమెరికాలో ఐదేళ్లలోపు చిన్నారులు ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువైంది.

Omicron in USA: ఒమిక్రాన్ మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టేలా లేదు.. కరోనా అన్నా కనికరిస్తుందేమోకానీ నేను మాత్రం అలా కాదు అని చిన్నారులను సైతం చుట్టుముట్టేస్తుంది. పెద్దవాళ్లకంటే వ్యాక్సిన్లు, బూస్టర్ డోసుల వంటివి ఉన్నాయి. పాపం ఇమ్యూనిటీ పవర్ ఏ మాత్రం లేని చిన్నారులు ఒమిక్రాన్ బారిన పడడం ఆందోళన చెందిస్తున్న అంశం.

శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం అమెరికాలో ఐదేళ్లలోపు చిన్నారులు ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువైంది. గత నెల రోజుల నుంచి ఒమిక్రాన్ వ్యాప్తి వేగం పుంజుకుంది. ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య రోజు రోజుకి ఎక్కువవుతోంది.

కాగా, మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి నాలుగో డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని బ్రిటీష్ ఆరోగ్య అధికారులు (యూకే) శుక్రవారం తెలిపారు. మూడో డోస్ తీసుకున్న 3 నెలల తరువాత 65 అంతకంటే ఎక్కువ వయసున్న వృద్ధులు ఆసుపత్రుల్లో చేరడం దాదాపు 90 శాతం తగ్గిందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 300 మిలియన్లు దాటింది. గత వారం రోజుల్లోనే కేసుల సంఖ్య డజన్ల కొద్దీ పెరిగింది అని రికార్డులు చెబుతున్నాయి. ఏఎఫ్‌పీ గణాంకాల ప్రకారం గడిచిన ఏడు రోజుల్లో మొత్తం 34 దేశాలుకాగా, ఆఫ్రికాలో ఏడు దేశాలున్నాయి.

అయితే యుఎస్, యుకె, కెనడా, ఇజ్రాయెల్ నుండి వచ్చిన డేటా ప్రకారం ఒమిక్రాన్‌తో ఆసుపత్రుల్లో చేరే ప్రమాదం 70 శాతం కంటే తక్కువగా ఉందని ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ అథారిటీ శుక్రవారం తెలిపింది. ఒమిక్రాన్ కరోనా అంత ప్రమాదకరమైంది కాదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story