ఇదే కరోనా వైరస్ నిజమైన ఆకృతి

ఇదే కరోనా వైరస్ నిజమైన ఆకృతి
కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి శాస్త్రవేత్తలు దీనిపై అనేక పరిశోదనలు చేస్తున్నారు. దీని వ్యాప్తి ఎలా ఉంటుంది.

కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి శాస్త్రవేత్తలు దీనిపై అనేక పరిశోదనలు చేస్తున్నారు. దీని వ్యాప్తి ఎలా ఉంటుంది. ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని దానిపై పలు పరిశోదనలు జరిగాయి. కరోనా వైరస్ ఆకృతిపై కూడా చాలా పరిశోదనలు జరిగాయి. అయితే, ఈ విషయంలో నార్త్ కరోలినా విశ్వవిద్యాలయం పరిశోదకులు విజయం సాధించారు. శ్వాసకోశ కణాల్లో ఉన్న కరోనావైరస్‌ ఫొటోలను వారు స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీని ద్వారా తీశారు.

మనిషిలోని ఊపిరితిత్తులలో గల బ్రాంకియల్‌ ఎపిథీలియల్ కణాలలోకి కరోనా టీకాతోపాటు కరోనా వైరస్‌ను కూడా పంపించారు. 96 గంటల తరువాత స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీని ఉపయోగించి పరిశీలించారు. తరువాత వీటి ఫోటోలు తీయడానికి అధిక శక్తి మాగ్నిఫికేషన్ వాడారు. ఈ ఫొటోలను 'న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్' ప్రచురించింది.

Tags

Read MoreRead Less
Next Story