దుబాయ్ షేక్ నోట ఎస్పీ బాలు పాట.. ఇందులో నిజమెంత..

దుబాయ్ షేక్ నోట ఎస్పీ బాలు పాట.. ఇందులో నిజమెంత..
అతను తెలుగు మాట్లాడకపోవచ్చు.. సంగీతానికి భాషతో పనేముంది.. దుబాయ్ షేక్ అయినా, భావం తెలియపోయినా తెలుగు పాటని

అతను తెలుగు మాట్లాడకపోవచ్చు.. సంగీతానికి భాషతో పనేముంది.. దుబాయ్ షేక్ అయినా, భావం తెలియపోయినా తెలుగు పాటని అలవోకగా ఆలపించేస్తున్నారు. తెలుగు భాష వచ్చిన వారు కూడా ఆ పాట పాడాలంటే తడబడతారు. కానీ ఈ షేక్ మాత్రం ఈజీగా ఆ పాటను ఆలపిస్తున్నారు. ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నా తెలుగు భాషను ఎంచుకుని సిరివెన్నెల సినిమాలోని సీతారామ శాస్త్రి రాసిన పాట పాడడం తెలుగువారికి ఒకింత గర్వకారణం. SP బాలు పాడిన ఆ పాట ఎంతో మధురంగా ఉంటుంది.

షేక్ టిక్‌టాక్ కోసం ఈ వీడియోను చేసినట్లు తెలుస్తోంది. అతను తన టిక్‌టాక్ ఖాతాలో వీడియోను షేర్ చేసిన మరుక్షణం, అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. చాలా మంది తెలుగువారు, భాషాభిమానులు వాట్సాప్‌లో ఈ వీడియోను ఫార్వార్డ్ చేయడం ప్రారంభించారు. భాష పట్ల ఆయనకున్న ప్రేమను ప్రశంసించారు. SP బాలుకి ఉత్తమ నేపథ్య గాయకుడిగా నంది అవార్డుని తెచ్చిపెట్టింది ఈ పాట. ఇది ఇప్పటికీ చాలా మంది సంగీత ప్రియులకు ఇష్టమైన తెలుగు పాట.

" సామవేద సారమిది ... నేపాడిన జీవన గీతం ... ఈ గీతం .. విపంచినై వినిపించిని ఈ గీతం…. "వీడియోలో షేక్ పాడే పంక్తులు. అతను అంత కఠినమైన పంక్తులను సులభంగా గుర్తుపెట్టుకుని పాటను అప్రయత్నంగా పాడటం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. వీడియో చివరలో, "నా టిక్‌టాక్ కుటుంబానికి ధన్యవాదాలు. నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను. " అని ముగించారు.

ఇది వైరల్ అవుతున్న మాట నిజమే. కానీ ఇది ఫేక్ న్యూస్. ఒక తెలుగు వ్యక్తే దుబాయ్ షేక్ లాగా పాడాడు అని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story