ఈజిప్ట్‌లో బయటపడ్డ 3 వేల ఏళ్ల నాటి అటెన్‌ నగరం ఆనవాళ్లు .. !

ఈజిప్ట్‌లో బయటపడ్డ 3 వేల ఏళ్ల నాటి అటెన్‌ నగరం ఆనవాళ్లు .. !
తాజాగా జరిపిన తవ్వకాల్లో ఓ ఆస్తిపంజరం కూడా బయటపడింది. కాళ్లు కట్టేసిన స్థితిలో ఉన్న ఆ అస్తిపంజరంతోపాటు మరోచోట ఎద్దుల కళేబరాలు కూడా గుర్తించారు.

ఈజిప్ట్‌లో 3 వేల ఏళ్లనాటి ఓ నగరం ఆనవాళ్లు ఇప్పుడు బయటపడ్డాయి. గతేడాది సెప్టెంబర్ నుంచి పురావస్తుశాఖ కొనసాగిస్తున్న తవ్వకాల్లో నాటి ఆటెన్ సిటీకి సంబంధించిన చరిత్ర వెలుగు చూసింది. లక్సర్‌ ఇసుక దిబ్బల కింద ఈ నగరాన్ని గుర్తించిన ఆర్కియాలజీ విభాగం.. ఇది అమెన్‌హోతెప్‌-3 కాలంనాటిదని తేల్చింది. పాలనానగరం, శ్రామికుల ఆవాసాలు, పరిశ్రమలను పోలిన నిర్మాణాల్లాంటివాటిని బట్టి చూస్తే గతంలో ఈ ప్రాంతం ఎంత ఘనకీర్తితో వర్ధిల్లిందో అర్థమవుతోందని పరిశోధనకులు చెప్తున్నారు.

తాజాగా జరిపిన తవ్వకాల్లో ఓ ఆస్తిపంజరం కూడా బయటపడింది. కాళ్లు కట్టేసిన స్థితిలో ఉన్న ఆ అస్తిపంజరంతోపాటు మరోచోట ఎద్దుల కళేబరాలు కూడా గుర్తించారు. అలాగే గోడలవైపు నాటి రాచరికపు ఆనవాళ్లకు సంబంధించిన ముద్రల్ని కూడా కనుగొన్నారు. ఇటుకలు, వివిధ రకాల పాత్రలు, ఉంగరాలు వంటివన్నీ జాగ్రత్తగా భద్రపరిచారు. 1922లో టూటెన్‌కామన్‌ సమాధిని కనిపెట్టారు. ఆ తర్వాత అతని పూర్వికులకు సంబంధించిన కీలకమైన సమాచారం ఈ స్థాయిలో లభ్యంకావడం ఇదేతొలిసారని పురావస్తుశాఖ చెప్తోంది.

Tags

Read MoreRead Less
Next Story