'కరోనా' బయటి కంటే ఇండోర్‌ స్పేస్‌లోనే ప్రమాదమా?

కరోనా బయటి కంటే ఇండోర్‌ స్పేస్‌లోనే ప్రమాదమా?
ప్రపంచంలో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజు లక్షలాది మంది కోవిడ్‌ బారిన పడుతన్నారు. కొన్ని దేశాలు కరోనా సెకండ్‌ వేవ్‌తో మళ్లీ లాక్‌డౌన్‌ బాటపట్టాయి..

ప్రపంచంలో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజు లక్షలాది మంది కోవిడ్‌ బారిన పడుతన్నారు. కొన్ని దేశాలు కరోనా సెకండ్‌ వేవ్‌తో మళ్లీ లాక్‌డౌన్‌ బాటపట్టాయి. అసలు కరోనా ఎలా సోకుతుంది? బయటి కంటే ఇండోర్‌ స్పేస్‌లోనే ప్రమాదమా? స్కూళ్లు, బార్లు, రెస్టారెంట్లు, ఇతర భవన సముదాయాల్లోనే ఒకరి నుంచి ఒకరికి కోవిడ్‌ అధికంగా సోకే ప్రమాదం ఉందా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. పలు సంస్థలు, యూనివర్సిటీలు నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడి అవుతున్నాయి. తాజాగా గాలి ద్వారా, మనిషి నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్నట్లు తేలడం కలవరానికి గురి చేస్తోంది.

చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ ముగియడంతో స్కూళ్లు, కాలేజీలు, బార్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సముదాయాలు తెరచుకున్నాయి. కానీ ఇక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. బయటితో పోల్చితే భవన సముదాయాల్లో కోవిడ్‌ రిస్క్‌ ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. అంతే కాదు ఇంట్లో బాధ్యాత రహితంగా గుంపులు గుంపులుగా చేరడంతో... స్నేహితులతో గంటల తరబడి కబుర్లు చెప్పడం కూడా కరోనా వ్యాప్తికి కారణమంటున్నారు. ఒక ఇంటి గదిలో ఆరుగురు ఒక్క చోట చేరితే... అందులో ఒక్కరికి కోవిడ్‌ పాజిటివ్‌ ఉన్నా... అందరికి రిస్కే. ఇలాంటి ఘటనల్లో దాదాపు 31 శాతం మందికి స్పెయిన్‌లో కరోనా సోకినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ఇండోర్‌ ప్రాంతాల్లోనే కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.

స్పెయిన్‌లో స్కూళ్లకు వెళ్లిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడ్డారట. దాదాపు 6 శాతం మేర కోవిడ్‌ బారిన పడడం ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ ఓ రికార్డుగా చెబుతోంది. ముఖ్యంగా స్కూళ్లు, బార్లు, రెస్టారెంట్లలో సరైన వెంటిలేటర్స్‌ లేకపోవడం కూడా కరోనా వ్యాప్తికి కారణమవుతోంది. వైరస్ కణాలు కొన్నిసార్లు గాలి ద్వారా వ్యాపిస్తాయని, ప్రత్యేకించి వెంటిలేషన్ సక్రమంగా లేని ప్రదేశాలలో త్వరగా సంక్రమిస్తుందని వైద్య నిపుణులు హచ్చరిస్తున్నారు. ఇప్పటికే మూసి ఉన్న ప్రదేశాలు, గదులలో కోవిడ్ రోగి నుంచి ఆరు అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉన్నా... వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెంటివ్ స్పష్టం చేసింది. ఆరు అడుగుల లోపున్నవారే జాగ్రత్తగా ఉండాలి.. గాలి, వెలుతురు సక్రమంగా లేని ప్రదేశాల్లో తుంపర్ల ద్వారా వైరస్‌ రెండు మీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుందని సీడీసీ చెబుతోంది. అయితే గాలిలో వైరస్‌ ఎంతసేపు జీవించి ఉంటుందన్నదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

Tags

Read MoreRead Less
Next Story