South Korea: పెళ్లిచేసుకుందామంటే పిల్లనివ్వట్లేదు.. 64 ఏళ్ల వృద్ధుడు అలిగి ఆత్మహత్యాయత్నం..

South Korea: పెళ్లిచేసుకుందామంటే పిల్లనివ్వట్లేదు.. 64 ఏళ్ల వృద్ధుడు అలిగి ఆత్మహత్యాయత్నం..
South Korea: ఈ అనూహ్య పరిణామానికి విస్తుపోయిన సిబ్బంది తక్షణమే స్పందించి అతడిపై నీరు పోసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.

South Korea: బుద్ధి, జ్ఞానం కొంచెమైనా ఉండక్కర్లా.. ముసలోడికి దసరా పండగ అంట.. మనవళ్లు, మనవరాళ్లకి పెళ్లి చేసే వయసులో ఉన్న నీకు పెళ్లేంటి.. చాలు చాల్లే పోవోయ్ అంటూ మ్యారేజ్ బ్యూరో వాళ్లు ఆ ముసలాయన్ని తరిమేశారు.. చింత చచ్చినా పులుపు చావలేదని 64 ఏళ్ల వయసులో పెళ్లి కావాలంట పెళ్లి.. అయినా పిల్లనెవరిస్తారని.. చేసుకున్నాక ఏం చేద్దామని.. అందరూ తాత అభిప్రాయాన్ని వ్యతిరేకించేవారే.. ఒక్కరైనా మద్దతు తెలిపేవారు లేరు.. దీంతో పాపం ఆ వృద్ధుడికి అవమానం, బాధ అన్నీ కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.. మ్యారేజ్ బ్యూరో ఆఫీస్‌లోనే పెట్రోల్ మీదపోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు..

64 ఏళ్ల దక్షిణ కొరియా వ్యక్తి మ్యారేజ్ బ్యూరో ఏజెన్సీతో తీవ్ర వివాదం తర్వాత ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ అనూహ్య పరిణామానికి విస్తుపోయిన సిబ్బంది తక్షణమే స్పందించి

అతడిపై నీరు పోసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే తీవ్రగాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. నివేదికల ప్రకారం.. అతడు గతంలో ఒక విదేశీ మహిళను వివాహం చేసుకున్నందున మరో వివాహానికి కుటుంబసభ్యుల అభ్యంతరాలతో పాటు మ్యారేజ్ బ్యూరో ఏజెన్సీ కూడా నిరాకరించింది.

Tags

Read MoreRead Less
Next Story