వణికిస్తున్న టోర్నడోలు.. సుడిగాలులు బీభత్సం

వణికిస్తున్న టోర్నడోలు.. సుడిగాలులు బీభత్సం

అమెరికాను టోర్నడోలు వణికిస్తున్నాయి. ఒక్లహోమాలో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి . టోర్నడో ధాటికి వందలాది ఇళ్లు నేలకూలాయి. ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హాస్పిటల్స్‌ తరలించి చికిత్స అందిస్తున్నారు. టోర్నడో ధాటికి ఓక్లహోమాలో వరదలు పోటెత్తాయి . సహాయక చర్యలను అధికారులుముమ్మరం చేశారు.

విద్యుత్తు సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో లక్షలాది మంది ప్రజలు అంధకారంలోనే ఉండిపోయారు. కూలిన భవనాలను మరమ్మతులు చేసే పనిలో అధికారులు, ప్రజలు నిమగ్నమయ్యారు. మరోవైపు టోర్నడో ధాటికి ఓక్లహోమాలో వరదలు పోటెత్తాయి. టోర్నడోలు పేరు వింటేనే స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అవి సృష్టించే గాలి కొన్ని వేల కిలోమీటర్ల స్పీడుతో ఉంటుంది.

టోర్నడోలు. వీటి పేరు వింటేనే స్థానిక ప్రజలు కంగారు పడిపోతారు. అవి సృష్టించే గాలి కొన్ని వేల కిలోమీటర్ల స్పీడుతో ఉంటుంది. తీరం వెంబడి 165 మైళ్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీని ప్రతాపానికి వేలాది మంది నిరాశ్రయు లయ్యారు. దాంతో అలెర్ట్ అయిన ప్రభుత్వం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

చెట్లు నేలకూలి రహదారులపై పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సోమవారం నాడు కూడా మరో టోర్నడో వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో అలబామా ప్రాంత వాసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సౌత్ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా ఏరియాల్లో టోర్నడో ఏర్పడే ఛాన్సుందని హెచ్చరికలు జారీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story