BA.2 variant : బ్రిటన్‌లో వెలుగులోకి కొత్తగా BA.2 అనే రకం వైరస్‌

BA.2 variant : బ్రిటన్‌లో వెలుగులోకి కొత్తగా BA.2 అనే రకం వైరస్‌
BA.2 variant : కొత్త కొత్త వేరియంట్ల రూపంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఒక దాని తర్వాత ఒకటి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి.

BA.2 variant :కొత్త కొత్త వేరియంట్ల రూపంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఒక దాని తర్వాత ఒకటి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. బ్రిటన్ లో కొత్తగా BA.2 అనే రకం వైరస్‌ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్ కేసులు 426 నమోదైనట్లు బ్రిటన్ తెలిపింది. ఒమిక్రాన్‌కు ఇది ఉప వేరియంట్‌గా భావిస్తున్నారు. వేరియంట్‌కు వేరియంట్ పుట్టడం ఇదే ప్రథమం అని అంచనా వేస్తున్నారు. BA.2 వేరియంట్ కూడా ఒమిక్రాన్ తరహాలోనే వేగంగా వ్యాప్తి చెందుతోందని... అయితే అంత ప్రమాదకరంగా మాత్రం గుర్తించలేదని యూకే పేర్కొంది. ఒమిక్రాన్ తరహాలో మ్యూటేషన్లు ఇందులో ఎక్కువ లేవన్నారు.

న్యూజిలాండ్‌లో తాజాగా ఒమిక్రాన్‌ కలకలం రేగింది. ఈ కొత్త వేరియంట్‌ సామాజిక వ్యాప్తిని అరికట్టేందుకు న్యూజిలాండ్‌ ప్రభుత్వం మరోసారి కొవిడ్‌ ఆంక్షలను కఠినతరం చేసింది. ఈ నిబంధనల నేపథ్యంలో తన వివాహ వేడుకను కూడా రద్దు చేసుకున్నట్లు ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ స్వయంగా ప్రకటించారు. మహమ్మారి కారణంగా ఇటువంటి అనుభవాలు ఎదుర్కొన్న అనేకమంది న్యూజిలాండ్‌ వాసుల జాబితాలో తానూ చేరానని చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story