Onions: ద్యావుడా.. ఉల్లిపాయల్లో బాక్టీరియా.. అనారోగ్యంతో 650 మంది..

Onions: ద్యావుడా.. ఉల్లిపాయల్లో బాక్టీరియా.. అనారోగ్యంతో 650 మంది..
Onions: సాల్మొనెల్లా బ్యాక్టీరియా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా 650 మందికి పైగా ప్రజలు అనారోగ్యం బారిన పడినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది.

Onions: సాల్మొనెల్లా బ్యాక్టీరియా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా 650 మందికి పైగా ప్రజలు అనారోగ్యం బారిన పడినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపధ్యంలో ఉల్లిపాయలను తనిఖీ చేయమని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రజలను కోరుతోంది.

మెక్సికోలోని చివావా నుండి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయల్లో ఈ బ్యాక్టీరియా ఉందని CDC తెలిపింది. అయితే అస్పటికే యుఎస్ అంతటా కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లకు ఈ ఉల్లిపాయలను పంపిణీ చేశారు.

చివరిగా ఆగస్టు 27 న ప్రభావిత ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంది. అయితే అవి మూడు నెలల వరకు నిల్వ ఉంటాయి. ఈ ఉల్లిపాయలు ఇళ్ళు, దుకాణాల్లో ఉండవచ్చని CDC తెలిపింది.

CDC ప్రకారం, కలుషితమైన ఉల్లిపాయలు తిని అస్వస్ధతకు గురైన కేసులు సెప్టెంబరు 1నుంచి కనిపించడం ప్రారంభించాయి. బుధవారం నాటికి 37 రాష్ట్రాల్లో 652 కేసులు నమోదయ్యాయి.

టెక్సాస్, ఓక్లహోమా, వర్జీనియా, మేరీల్యాండ్, ఇల్లినాయిస్‌లో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కాలిఫోర్నియా, ఒరెగాన్, దక్షిణ మరియు ఉత్తర డకోటా, ఉటా, కొలరాడో, న్యూ మెక్సికో, నెబ్రాస్కా, కాన్సాస్, మిస్సోరి, అర్కాన్సాస్, మిన్నెసోటా, అయోవా, విస్కాన్సిన్, లూసియానా, మిసిసిపీ, అలబామా, టేనస్సీ, జార్జియా, ఉత్తర మరియు దక్షిణ కరోలినా ఫ్లోరిడా, కెంటుకీ, ఇండియానా, మిచిగాన్, ఒహియో, వెస్ట్ వర్జీనియా, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, కనెక్టికట్, మసాచుసెట్స్, న్యూయార్క్ లో కూడా కేసులు నమోదవుతున్నాయి.

అయితే అదృష్టవశాత్తూ ఎవరూ మరణించలేదు. కానీ సాల్మొనెల్లా బ్యాక్టీరియా వ్యాప్తి ఫలితంగా 129 మంది ఆసుపత్రి పాలయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story