బిగ్ బ్రేకింగ్ : బ్రిటన్ లో మళ్లీ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం

బిగ్ బ్రేకింగ్ : బ్రిటన్ లో మళ్లీ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం
బ్రిటన్ లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో కలిసి కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒక వాలంటీర్ కు అస్వస్థత..

బ్రిటన్ లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో కలిసి కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒక వాలంటీర్ కు అస్వస్థత కారణంగా ఇటీవల ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ ఆగిపోయాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలయింది. ఈ క్రమంలో శనివారం మళ్ళీ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. భద్రతా డేటాను స్వతంత్రంగా సమీక్షించిన తరువాత ట్రయల్స్ పున ప్రారంభించాలని UK రెగ్యులేటర్, మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (MHRA) సిఫారసు చేసినట్లు ఆక్స్ ఫర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ట్రయల్స్ లో పాల్గొనేవారి గురించి వివరాలను వెల్లడించడానికి మాత్రం నిరాకరించింది.

Tags

Read MoreRead Less
Next Story