పాక్‌కు మరోసారి షాక్‌ ఇచ్చిన మోదీ

పాక్‌కు మరోసారి షాక్‌ ఇచ్చిన మోదీ

పాకిస్థాన్‌కు మరోసారి మోదీ షాక్‌ ఇచ్చారు. ఇప్పటికే నిబంధనలను పలుమార్లు ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్‌కు.. తనదైన శైలిలో సమాధానం చెప్పేందుకు సిద్ధమంటూ మోదీ సంకేతాలు ఇచ్చారు. ఈ నెల 30న రెండోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బిమ్‌స్టెక్ దేశాధినేతలకు భారతదేశం ఆహ్వానం పంపింది. BIMSTEC అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటీవ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కార్పొరేషన్. బంగాళాఖాతం తీరంగా ఉన్న దేశాలు మాత్రమే బిమ్‌స్టెక్ గ్రూప్‌లో ఉన్నాయి.

భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు బిమ్‌స్టెక్ గ్రూప్‌లో ఉన్నాయి. భారతదేశం బిమ్‌స్టెక్ దేశాలకే మోదీ ప్రమాణ స్వీకార వేడుక ఆహ్వానం పంపంది. ఇరుగు పొరుగు దేశాలు అన్నింటికీ ఆహ్వానం పంపి.. పక్కనున్న దాయాది దేశానికి మాత్రం ఎలాంటి ఆహ్వానం పంపలేదు భారత్..

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రమాణ స్వీకార వేడుకకు ఆహ్వానించకూడదన్న ఆలోచనతోనే భారతదేశం బిమ్‌స్టెక్ గ్రూప్‌ను ఎంచుకుందన్న వాదన వినిపిస్తోంది. మారిషస్, కిర్గిజ్ రిపబ్లిక్ దేశాధినేతలకు కూడా ఆహ్వానాలు అందాయి. కానీ పాకిస్తాన్‌కు మాత్రం ఇన్విటేషన్ పంపలేదు. దీనిపై పాకిస్తాన్ స్పందించింది. తమ దేశాధినేతకు ఆహ్వానం పంపకుండా భారత ప్రధాన మంత్రి అంతర్గత రాజకీయాలు అడ్డుపడ్డాయని పాక్ ప్రభుత్వం స్పందించింది.

2014లో మోదీ ప్రమాణస్వీకారం చేసినప్పుడు సార్క్ దేశాధినేతల్ని ఆహ్వానించింది భారతదేశం. అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత ప్రధాని మోదీ పాకిస్తాన్ వెళ్లడం, నవాజ్ షరీఫ్ ఇంట్లో వేడుకకు హాజరవడం లాంటి పరిణామాలతో రెండు దేశాల మధ్య స్నేహం చిగురిస్తుందని అనుకున్నారంతా. కానీ 2016లో పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల దాడులు, లైన్ ఆఫ్ కంట్రోల్‌లో భారతదేశం సర్జికల్ స్ట్రైక్స్, 2019లో పుల్వామాలో భారత సైన్యంపై మరోసారి ఉగ్రవాద దాడులు, ఆ తర్వాత పాకిస్తాన్‌లో బాలాకోట్‌లో భారతదేశం ఎయిర్‌స్ట్రైక్స్ లాంటి పరిణామాలతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అందుకే ఈసారి మోదీ మాత్రం పాక్‌కు ఆహ్వానం పంపలేదు..

Tags

Read MoreRead Less
Next Story