Sruthy Sithara: మిస్‌ ట్రాన్స్‌ గ్లోబల్‌ యూనివర్స్‌గా ఇండియన్ రికార్డ్..

Sruthy Sithara (tv5news.in)

Sruthy Sithara (tv5news.in)

Sruthy Sithara: సమాజంలో చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసి చూసేవారు చాలామందే ఉంటారు.

Sruthy Sithara: సమాజంలో చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసి చూసేవారు చాలామందే ఉంటారు. ఎప్పటినుండో ట్రాన్స్‌జెండర్‌ల విషయంలో అలాగే జరుగుతుంది. చాలామంది ట్రాన్‌జెండర్లు ఇప్పటికీ సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని, ఓ గౌరవం దక్కాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా అలాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తోంది కేరళకు చెందిన శ్రుతి సితార.

ప్రపంచంలోని ట్రాన్స్‌జెండర్లకు తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకునే వేదికగా నిలుస్తాయి మిస్‌ ట్రాన్స్‌ గ్లోబల్‌ యూనివవర్స్‌ పోటీలు. ఈ పోటీలకు ఎన్నో దేశాల నుండి ట్రాన్‌జెండర్లు వచ్చి పోటీ చేస్తారు. ఇప్పటివరకు ఈ పోటీల్లో ఇండియాకు సంబంధించిన ఒక్క ట్రాన్‌జెండర్ కూడా గెలవలేదు. ఈసారి ఆ రికార్డ్‌ను శ్రుతి సితార బ్రేక్ చేసింది.

ప్రస్తుతం శ్రుతి సితార సామాజిక న్యాయ విభాగంలో ట్రాన్స్‌జెండర్‌ సెల్‌లో పని చేస్తున్నారు. అంతే కాక మోడల్‌గా, ఆర్టిస్ట్‌గా కూడా గుర్తింపు తెచ్చుకోవడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. ఎల్జీబీటీ, క్వీర్‌ రైట్స్‌పై ప్రచారం కూడా చేస్తుంటారు. ట్రాన్స్ మహిళలకు ధైర్యం చెప్పడం కోసం ఎన్నో కార్యక్రమాలలో, పాఠశాలలో శ్రుతి ప్రసంగించారు. ఈ విజయంతో మరికొందరు ట్రాన్స్ మహిళలు ధైర్యంగా బయటికి వచ్చి వారికి నచ్చిన పని చేయగలిగితే చాలు అన్నారు శ్రుతి సితార.

Tags

Read MoreRead Less
Next Story