అదృష్టం అంటే ఇదీ.. పక్కింటాయన ఇచ్చిన బొమ్మలకు వేలంలో కోట్లు..

అదృష్టం అంటే ఇదీ.. పక్కింటాయన ఇచ్చిన బొమ్మలకు వేలంలో కోట్లు..
దంపతులు ఒక్కరోజులో కోటీశ్వరులైపోయారు.

అదృష్ట దేవత ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు.. ఒక్కొక్కరికి ఒక్కో హాబీ.. వాళ్లు సేకరించిన వస్తువులు వాళ్లకి అక్కరకు వస్తాయో లేదో తెలియదు కానీ తరువాతి తరాలకు మాత్రం కోట్లు కురిపిస్తాయి. ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది.. ఇంగ్లాండ్‌లోని ఓ వ్యక్తికి స్టార్‌వార్స్‌కి సంబంధించిన బొమ్మలు సేకరించే హాబీ.. అతడు చనిపోతూ ఈ బొమ్మలు చాలా విలువైనవి జాగ్రత్తగా పెట్టుకోండి అని పక్కింట్లో ఉన్న దంపతులకు అప్పజెప్పి కన్నుమూశాడు.

ఇల్లు ఇరుకు ఇన్ని బొమ్మలు ఎక్కడ పెట్టుకునేది.. అని స్నేహితులను సలహా అడిగారు ఆ జంట. బొమ్మలను చూసిన స్నేహితులు అవాక్కయ్యారు. ఇవి చాలా పురాతనమైన కలెక్షన్ అని వీటిని వేలం వేస్తే బోలెడు డబ్బులు వస్తాయని చెప్పారు. దాంతో ఆ జంట ఆస్టోన్స్ ఆక్షనీర్స్‌ను ఆశ్రయించారు. బొమ్మలను పరిశీలించిన స్పెషలిస్ట్ ఆస్టన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.. ఇవి చాలా అరుదైన కలెక్షన్ అని చెప్పాడు. ఇవి ఇప్పడు మార్కెట్లో లేవని అన్నారు.

వాడుకలో లేని ఈ బొమ్మలు 1978 నుంచి 2015 వరకు వివిధ రూపాల్లో వచ్చినవని వివరించారు. వీటిని ఆస్టన్ ఆక్షన్‌లో పెట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ బొమ్మలకు ఊహించని డిమాండ్ వచ్చింది. మొత్తం బొమ్మలు రూ.3 కోట్ల ధర పలికాయి. ఆ విధంగా బ్రిటీష్ దంపతులు ఒక్కరోజులో కోటీశ్వరులైపోయారు.

Tags

Read MoreRead Less
Next Story