Talibans: తాలిబన్ల అరాచకం.. ఆఫ్ఘన్ మహిళలపై మరో వేటు

Talibans: తాలిబన్ల అరాచకం.. ఆఫ్ఘన్ మహిళలపై మరో వేటు
Talibans: ఆఫ్ఘనిస్తాన్‌లో, తాలిబాన్ మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడం ఆపివేసింది.

Talibans: తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌లో ఇప్పుడు మహిళలు డ్రైవింగ్ చేయకుండా నిషేధించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ పాలన కాబూల్ మరియు ఇతర ప్రావిన్స్‌లలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని నిలిపివేసింది.

"మహిళా డ్రైవర్లకు లైసెన్సుల జారీని నిలిపివేయాలని మాకు మౌఖిక ఆదేశాలు అందాయి. కానీ నగరంలో మహిళలు డ్రైవింగ్ చేయకూడదని చెప్పలేదు అని ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ అధిపతి జన్ అఘా అచక్‌జాయ్ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

గత సంవత్సరం ఆగస్టులో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆఫ్ఘనిస్తాన్‌లో మానవ హక్కుల పరిస్థితి మరింత దిగజారింది. దేశంలో పోరాటాలు ముగిసినప్పటికీ, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి, ముఖ్యంగా మహిళలపై వారి అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

ఆఫ్ఘనిస్తాన్‌లోని బాలికలను ఆరవ తరగతి కంటే ఎక్కువ చదవకూడదని నిషేధించింది. ఈ చర్యపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. "ఉపాధ్యాయుల కొరత" కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు, ఆరవ తరగతికి మించి చదువుకునే బాలికల హక్కు "త్వరలో" పునరుద్ధరించబడుతుందని తాలిబన్ నాయకులు చెబుతున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు ఆహార కొరత ఏర్పడింది. ఆఫ్గనిస్తాన్ ని తాలిబాన్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, వివిధ దేశాలు చేస్తున్న అభివృద్ధి సహాయం ఆగిపోయింది. అంతర్జాతీయ దాతలు అందించే 80 శాతం బడ్జెట్ ఆగిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story