ఆ స్ధానంలో నేనుంటే ఇంత పెద్ద మొత్తం చెల్లించేవాడిని కాదు

ఆ స్ధానంలో నేనుంటే ఇంత పెద్ద మొత్తం చెల్లించేవాడిని కాదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ లో పర్యటిస్తున్నారు. ఐరోపా సమాఖ్యనుంచి ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే బయటకు రావాలంటూ ట్రంప్, బ్రిటన్ కు సలహా ఇచ్చారు. బ్రిటన్ స్థానంలో నేనే ఉంటే ఇంత పెద్ద మొత్తం చెల్లించేవాడిని కాదన్నారు. బ్రెగ్జిట్ నుంచి వైదొలగాలని భావిస్తున్న బ్రిటన్ కు పలు అడ్టంకులు ఎదురుకావడంతో అయోమయంలో పడింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రిటన్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నాలుగు దశాబ్దాల పాటు ఐరోపా సమాఖ్యలో ఉన్న బ్రిటన్… అందులోంచి బయటకు వచ్చేందుకు 50 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఒప్పుకుంది. దీనిపై పార్లమెంట్ లో ఓటింగ్ జరుగగా మూడుసార్లు చుక్కెదురైంది. దీంతో బ్రేగ్జిట్ రెండుసార్లు వాయిదా పడింది.

Tags

Read MoreRead Less
Next Story