IVF: ఆస్పత్రి నిర్వాకం.. ఆమె మరొకరి బిడ్డకు జన్మనిచ్చింది..

IVF: ఆస్పత్రి నిర్వాకం.. ఆమె మరొకరి బిడ్డకు జన్మనిచ్చింది..
IVF: ఈ క్రమంలోనే అలాంటి తల్లులకు ఐవీఎఫ్‌ ఓ ఆశాకిరణంలా కనబడుతోంది.

IVF: అమ్మ కావాలని, బిడ్డ చేత అమ్మా అనిపించుకోవాలని పెళ్లైన ప్రతి స్త్రీ ఆరాట పడుతుంది. అమ్మ అయ్యే అవకాశాలు లేవని చెప్పినా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ, దేవుళ్లకు మొక్కుతూ తమ కల నెరవేరాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే అలాంటి తల్లులకు ఐవీఎఫ్‌ ఓ ఆశాకిరణంలా కనబడుతోంది.

అమెరికాకు చెందిన డఫ్నా, అలెగ్జాండర్ దంపతులకు వివాహం అయి చాలా కాలం అయినా పిల్లలు పుట్టలేదు. దాంతో వారు కత్రిమ గర్భధారణ ద్వారా బిడ్డను కనాలనుకున్నారు. ఈ క్రమంలో ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన డఫ్నా.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ రంగు, ఒత్తైన నల్లని జుట్టు చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోయారు.

తమ కుటుంబంలో ఎవరికీ ఇలాంటి శరీర ఛాయ, జుట్టు లేవని అనుమానంతో ఐవీఎఫ్ కేంద్రాన్ని సంప్రదించారు. అక్కడి స్టాఫ్‌ని నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డఫ్నా దంపతులు ఐవీఎఫ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే మరో జంట కూడా కృత్రిమ గర్భధారణ కోసం అదే క్లినిక్‌కి వచ్చింది.

ఈ రెండు జంటలకు ట్రీట్‌మెంట్ అందిస్తుంది ఒకే డాక్టర్ కావడంతో ఒకరి పిండాలను మరొకరికి ఇంజెక్ట్ చేశాడు. డఫ్నా దంపతుల పిండాన్ని వేరే వారి గర్భంలో.. వారి పిండాల్ని డఫ్నా గర్భంలో ప్రవేశపెట్టాడు. జుట్టు, శరీర ఛాయ వేరుగా ఉండడంతో అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ క్రమంలో డఫ్నా దంపతులు ఐవీఎఫ్ కేంద్రంపై కేసు పెట్టారు. తమ బిడ్డను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రెండు జంటలు తమ జన్యపరమైన బిడ్డలను పరస్పరం మార్చుకుని సొంత బిడ్డలతో ఇంటికి వెళ్లారు.

Tags

Read MoreRead Less
Next Story