పెళ్లితో ఒక్కటైన టాలీవుడ్ సింగర్, హీరోయిన్

Noel Ester Noronha Wedding

సింగర్ కం నటుడు నోయెల్‌ ఓ ఇంటివాడయ్యారు. నటి ఎస్తేర్‌ నోరోన్హాను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం క్రైస్తవ మత పద్ధతిలోమంగళూరులో జరిగింది. వివాహ వేడుక సందర్బంగా దిగిన ఫొటోను నోయెల్‌ తన ట్విటర్‌ లో షేర్ చేశారు. తాము ఇప్పుడు ఇద్దరు కాదని, ఒక్కటే.. నా హృదయానికి ఆమే రాణి అందరి ఆశీస్సులు మాకు కావలి అని నోయెల్‌ ట్వీట్‌ చేశారు. కాగా వీరి వీరి వివాహానికి ఎస్‌.ఎస్‌. రాజమౌళి దంపతులు హాజరయ్యారు. కొంతకాలంగా గాఢమైన ప్రేమలో ఉన్న వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు.

నటి ఎస్తేర్‌ నోరోన్హా తేజ దర్శకత్వంలో వచ్చిన ‘1000 అబద్ధాలు’ సినిమాతో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆ తర్వాత ‘భీమవరం బుల్లోడు’, ‘జయ జానకి నాయక’ తదితర సినిమాల్లో నటించారు. ప్రస్తుతం హిందీ, తెలుగు, మలయాళం తదితర భాషల్లో ఆమె నటిస్తోంది. కాగా నోయెల్‌ అటు గాయకుడిగానూ ఇటు నటుడిగాను గుర్తింపు పొందారు. ‘మగధీర’, ‘ఈగ’, ‘కుమారి 21 ఎఫ్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ప్రేమమ్’, ‘రంగస్థలం’, ‘హలో గురు ప్రేమ కోసమే’,‘పడి పడి లేచె మనసు’ తదితర చిత్రాలతో గుర్తింపు తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.

Recommended For You