నెమలి ఎక్కడైనా ఎగరడం చూశారా.. అదీ జనం ఉన్నప్పుడు..

నెమలి ఎగరడం ఎప్పుడైనా చూశారా..? అది కూడా జనాలమధ్య నుంచి చక్కర్లు కొడుతూ నెమలి ఎగరడం చాలా అరుదు. అలాంటి దృశ్యమే జరిగింది.. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సాధారణంగా నెమళ్ళు జనాల మధ్య తిరగవు.. అడవిలో లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో తిరుగుతూ పురివిప్పి నాట్యాం చేస్తాయి.. ఆ సమయంలో నెమలిని చూస్తే గొప్ప అనుభూతి కలుగుతుంది.ఎందుకంటే ఆ సమయంలో అది చాలా అందంగా కనిపిస్తుంది. ఇక నెమళ్ళు ఎగరడం కూడా చాలా అరుదు.. అయితే ఒకచోట నుండి మరోచోటుకి అవి ప్రయాణించాలంటే మాత్రం పక్షి వలే ఎగురుతూ కనిపిస్తాయి. కానీ మనుషుల కంటపడవు అని పెద్దవాళ్ళు చెబుతుంటారు. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న నెమలి మాత్రం అందంగా ఎగురుతూ చూపరులకు కనువిందు చేసింది.

Recommended For You