రూ.5తో దుబాయికెళ్లి.. రూ. 579 కోట్లు సంపాదించాడు..

కృషి, నిరంతరం పట్టుదల ఉంటే సాధించనిదంటూ ఏమీ లేదు. తన కృషితో ఆసియా దేశాల్లో టాప్ ఇండియన్ లీడర్స్‌లో ఒకరిగా మారారు. రూ 5 తో దూబాయి వెళ్లిన రామ్ బుక్సానీ ఇప్పుడు రూ. 500 కోట్ల అధిపతిగా మారారు. 1941లో స్వాతంత్ర్యం రాకముందు పాకిస్థాన్ పరిథిలో ఉన్న హైదరాబాద్‌లో రామ్ బుక్సానీ జన్మించారు. అతనికి అయిదేళ్లు ఉన్నప్పుడు తండ్రి మరణించాడు. తదితర పరిణామాల అనంతరం అతని కుటుంబం గుజారాత్‌లోని వడోదరకు వలస వెళ్లింది. అక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉన్నారు బుక్సానీ. ఆ సమయంలో ఓ పత్రికలో వచ్చిన ప్రకటన చూశారు దుబాయిలోని వాణిజ్య కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌ ఉద్యోగాలున్నాయని ఆ ప్రకటన సారాంశం. అనంతరం ఈ విషయాన్ని అతని తల్లి,సోదరుడితో చర్చించి వాళ్ళను ఒప్పించి దుబాయిలోకి అడుగు పెట్టారు.
అప్పుడు అతని వయస్సు 18 ఏళ్లు. సాధారణ ఉద్యోగిగా 1959 సంవత్సరంలో ఆ దేశంలొ అడుగుపెట్టారు.బుక్సానీ దుబాయి వెళ్లినప్పుడు అక్కడ కనీసం విమానాశ్రయం కూడా లేదు. ముంబాయి నుంచి పడవ ప్రయాణం చేశారు. అయిదు రోజులు తర్వాత దుబాయికి చేరుకున్నారు. అతనికున్న అర్హతల వల్ల ఆ ఉద్యోగంలో చేరి పోయారు. అప్పటి ఆయన నెల జీతం.. 125 రూపాయలుగా ఉండేది. వాటిలో నెలకు 75 రూపాయలను వారి కుటుంబానికి పంపించేవారు. అయితే కంపెనీ బుక్సానీ సామర్ధ్యాన్ని గుర్తించి అతనికి రెండు బంఫర్ అఫర్లను ప్రకటించింది. కంపెనీలో షేర్లు కావాలా? లేక జీతాన్ని మరో రూ.300కు పెంచాలా? ఏదో ఒక దాన్ని ఎంచుకోమని యాజమాన్యం అతన్ని కోరింది. బుక్సానీ మెుదటి ఆప్షన్‌ను ఎంచుకున్నారు. అదే తన జీవితాన్ని మలుపు తిప్పింది.
అనంతరం సంస్థలో నిర్ణయాధికారి శక్తిగా మారారు. కంపెనీ తయారుచేసే ప్రోడక్ట్స్‌ను బ్రోకర్లు కొనుగోలు చేసి వారు వాటిని బయటి మార్కెట్లో అధిక ధరకు అమ్ముకునేవారు.
ఈ విధానం వల్ల కంపెనీ నష్టపోతుందని గ్రహించిన అతను సంస్ధ ద్వారానే వాటిని విక్రయించాలని నిర్ణయించారు. ఈ విషయంపై సంస్థలోని మిగతా ప్రతినిధులతో చర్చించారు
దానికి వారు ఒప్పుకోలేదు. దీంతో బుక్సానీ ఎవరి అనుమతి తీసుకోకుండా సిగరెట్, లైటర్, పింగాణీ గిన్నెల శాంపిల్స్‌ను దుస్తుల్లో దాచుకుని దొంగచాటుగా బయటకు తీసుకెళ్లారు. అనంతరం వాటిని సిటీకి తీసికెళ్లి అమ్మారు. ఓ చిన్న వ్యాపారవేత్తకు వాటిని విక్రయించారు. అనంతరం ఆ వ్యాపారవేత్త మరో 125 డాలర్ల విలువ చేసే వస్తువులను ఆర్డర్ కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని వచ్చి సీనియర్‌కు వివరించారు బుక్సానీ . దీంతో కంపెనీ ప్రత్యక్ష అమ్మకాలను మెుదలు పెట్టింది. కొనాళ్ళ తర్వాత సహభాగస్వాములు కొందరు తమ షేర్లను అమ్మాలనుకుంటున్నట్లు తెలిపారు. దీంతో ఆ షేర్లను కొనాలని అతను నిర్ణయించుకున్నారు. తర్వాత వివిధ రంగాలకు వ్యాపారాన్ని విస్తరించారు. రామ్ బుక్సానీ ఐటీఎల్ కాస్మోస్ గ్రూప్‌ చైర్మన్‌‌గా దుబాయిలో ఓ ప్రముఖ భారతీయ వ్యాపారవేత్తగా ఉన్నారు. 5 రూపాయిలతో దుబాయి వచ్చిన తను ఇప్పుడు 300 మిలియన్ దిర్హమ్‌ల (579 కోట్ల 78 లక్షల రూపాయలకు పైగానే..)కు అధిపతిగా మారారు.

Recommended For You