ఆఖరి ఓవర్.. అందరిలో టెన్షన్..టెన్షన్..కానీ వారు మాత్రం..

గెలుపును నిర్ణయించేవి ఆఖరి ఓవర్లే. అంతకుముందు నెమ్మదిగా ఆడిన బాట్స్‌మెన్ ఆ ఓవర్లలో మాత్రం శివాలెత్తిపోతాడు. ప్రేక్షకులు ఉద్వేగంతో చూస్తుంటారు.మరోవైపు ఒత్తిడి చంపేస్తుంటుంది. విజయమో వీర స్వర్గమో తేల్చుకోవాల్పిన సమయం అది.ఇంకేముంది ఆ సమయంలో బౌలింగ్ చేసే బౌలర్‌కు చుక్కలు కనిపిస్తాయి.అలా ఐపీఎల్‌ చరిత్రలో శిక్షకు గురైన కొన్ని ఆఖరి ఓవర్లు ఏంటో చూద్దాం..

2018 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాళ్ళు సంజు శాంసన్‌, రాహుల్‌ త్రిపాఠి బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయారు. ఉమేశ్‌ యాదవ్‌ను ఓ ఆట ఆడుకున్నారు. అతని బౌలింగ్‌లో వీరిద్దరూ కలిసి 2, 6, 4, 1+నోబ్‌, 6, 6, 1 సాధించారు. సంజూ శాంసన్ ఈ ఓవర్లలో అత్యధిక పరుగులు సాధించారు. దీంతో అతడికి టీమిండియాలో చోటు ఖాయం అనుకున్నారు.

Related image

2017 సీజన్‌లో ముంబయి ఇండియన్స్..రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్ . ముంబయి యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య క్రిజ్‌లో ఉన్నారు.రైజింగ్‌ పూణె తరుపున పేసర్‌ అశోక్‌ దిండా బౌలర్. ఒకవైపు హార్డ్‌ హిట్టర్‌, మరోవైపు పస లేని పేస్ బౌలర్. ఇంకేముంది ఆ ఓవర్లలో పాండ్య రెచ్చిపోయాడు.అతని బౌలింగ్‌లో ఏకంగా 30 పరుగులు సాధించాడు. మొదటి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. తర్వాతి బంతిని బౌండరీ లైన్ దాటించాడు.నాలుగో బంతికి భారీ సిక్సర్‌. ఐదో బంతి వైడ్‌ పడింది. అయినప్పటికీ వికెట్ లభించింది. చివరి బంతి బై రన్ వచ్చింది. దీంతో ఈ ఓవర్ ఐపీఎల్‌ చరిత్రలో ఇది అత్యంత దారుణమైన ఓవర్‌గా నిలిచింది.

Image result for shreyas iyer

2014లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు తరుపున ఆడిన యువరాజ్‌ సింగ్‌ ధిల్లీ డేర్‌డెవిల్స్‌ బౌలర్‌ ఆర్‌.శుక్లా బౌలింగ్‌లో విధ్వసం సృష్టించాడు. ఎస్‌ రాణాతో కలిసి శుక్లా బౌలింగ్‌లో 1, 0+వైడ్‌, 6, 6, 6, 0+వైడ్‌, 6, 0 పరుగులు రాబట్టాడు. ఆ ఓవర్లలో మెుత్తం 27 పరుగులు రాబట్టాడు.

ఐపీఎల్‌ 2018 సీజన్‌లో ప్రస్తుత దిల్లీ క్యాపిటల్స్‌ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ మంచి ఫెర్‌‌ఫామెన్స్ ఇచ్చాడు. ఆ సీజన్‌లో కోల్‌కతా బౌలర్‌ శివమ్‌ మావి వేసిన ఆఖరి ఓవర్‌లో ఊచకోత కోశాడు. తొలి రెండు బంతుల్ని భారీ సిక్సర్‌లుగా మలిచాడు. మూడో బంతికి అవతలి ఎండ్‌లోని బ్యాట్స్‌మన్‌ రనౌట్‌ అయ్యాడు. నాలుగో బంతి స్టాండ్స్‌పై నుంచి భారీ సిక్సర్ బాదారు. ఐదో బంతి వైడ్‌. ఇక చివరి రెండు బంతుల్లో ఫోర్, సిక్స్ లభించాయి. దీంతో ఆ ఓవర్లలో మొత్తం 29 పరుగులు వచ్చాయి.

ఈ సీజన్‌లో హార్దిక్‌, పొలార్డ్‌తో కలిసి సృష్టించిన విధ్వసం అంతాఇంతా కాదు. చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో చివరి ఓవర్‌ను వీరిద్దరూ కలిసి ఓ ఆట ఆడుకున్నారు. మెుదటగా రెండు బంతులను వేసే క్రమంలో 1, 0+వైడ్‌, 1, నోబ్‌+6 గా 10 పరుగులు లభించాయి. తర్వాతి నాలుగు బంతుల్లో 3, 6, 4, 6 దంచేశారుదీంతో బ్రావో ఓవర్‌లో 29 పరుగులు రాబట్టింది.

ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై జడ్డూ సహకారంతో ఎంఎస్‌ ధోనీ రెచ్చిపోయాడు. జయదేవ్‌ ఉనద్కత్‌ను చీల్చిచెండాడాడు.తొలి బంతికి సింగిల్‌, రెండో బంతికి భారీ సిక్సర్‌, మూడో బంతికి వైడ్‌+0గా పడడంతో 8 పరుగులు వచ్చాయి. తర్వాత వరుసగా రెండు సిక్సర్లు.
ధోనీ బాదుడుకు ఏం చేయాలో అర్ధం కానీ జయదేవ్‌ మళ్లీ వైడ్‌ వేశాడు. చివరి బంతిని మహీ భారీ సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఆ ఓవర్లో 28 పరుగులు వచ్చాయి.ఇవండీ ఆఖరి ఓవర్లలో బాట్స్‌మెన్ సాధించిన భారీ విధ్వంసాలు.ఇప్పుడు జరుగుతున్న 12వ సీజన్‌లో ఇంకెన్ని హిట్టింగ్స్ ఉంటాయో చూడాలి.

Recommended For You