ఐపిఎల్‌లో కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్ర

ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ధోనీసేన 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఐదో విజయం సాధించి 10 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కోల్‌కతా నిర్దేశించిన 109 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 17.2 ఓవర్లలోనే విజయాన్ని సాధించింది. చెన్నై ఆటగాళ్లలో డుప్లిసిస్ 43 రన్స్, వాట్సన్ 17, రైనా 14, రాయుడు 21, కేదార్ జాదవ్ 8 పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేసింది.

Recommended For You