ఎయిర్‌పోర్ట్‌లో ధోని, సాక్షీ నేల మీదే..

ఆకలేస్తే ఏదైనా తినేస్తాం.. నిద్దరొస్తే ఎక్కడ పడుక్కున్నా పట్టేస్తుంది. అందునా బాగా అలసిపోతే పట్టు పరుపులు ఏమీ అక్కరలేదు. కాస్త ప్లేస్ దొరికితే చాలు. హ్యాపీగా ఓ స్లీప్ వేసేస్తారు. అందరిలానే మరి నేను కూడా. నేనేమీ స్పెషల్ కాదే అంటున్నాడు మన మహేంద్ర సింగ్ ధోని. సింప్లిసిటీకి మారు పేరుగా నిలిచే ధోని అలాగే అభిమానుల మనసు
దోచుకుంటాడు చాలా సందర్భాల్లో.

తాజాగా మంగళవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడారు. మళ్లీ గురువారం జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన చెన్నై జట్టు విమానం రావడానికి ఇంకా సమయం ఉండడంతో కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. వెంటనే బ్యాగుని తలకింద పెట్టుకుని పడకేశాడు.

అది చూసిన ధోనీ భార్య సాక్షికి కూడా నిద్రొచ్చేసింది. తనకూడా బ్యాగ్‌కి ఓ పక్కన తలపెట్టి అక్కడే నేలమీద పడుకుండి పోయింది. మిగతా క్రికెటర్లందరూ కుర్చీల్లోనే కునికిపాట్లు పడుతున్నారు. ఇక ఈ వార్తను చూసిన నెటిజన్స్ వావ్.. ధోనీ వాటే
సింప్లిసిటీ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Recommended For You