భారత హోం మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు..

భారత హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఎంబీబీఎస్ లేదా తత్సమాన కోర్సు చేసినవారు అర్హులు. మొత్తం 496 పోస్టులకి గాను నోటిఫికేషన్‌ని విడుదల చేశారు అధికారులు.
పోస్టులు: 496
విభాగాలు: సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్: 4
స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లు (డిప్యూటీ కమాండెంట్) – 175
మెడికల్ ఆఫీసర్లు: 317
అర్హత: ఉద్యోగాలను బట్టి ఉంటుంది.
వయసు: ఉద్యోగాలను బట్టే దీన్ని కూడా నిర్ణయిస్తారు.
ఎంపిక: అకడమిక్ ప్రతిభ, పర్సనాలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఫీజు: జనరల్, ఓబీసీ కేటగిరీ పురుష అభ్యర్థులకు రూ.400. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఉచితం.
దరఖాస్తుకి చివరి తేదీ: మే 1.
వెబ్‌సైట్: http://www.recruitment.itbpolice.nic.in/

Recommended For You