మీరు విండోస్ ఫోన్ వాడుతున్నారా.. అయితే..

మైక్రోసాప్ట్ విండోస్ ఫోన్లు వాడేవారికి బ్యాడ్ న్యూస్. త్వరలో ఈ ఫోన్లపై ఫేస్‌బుక్ సేవలు బంద్ కానున్నాయి. ఎన్‌గ్యాడ్జెట్ నివేదిక ప్రకారం.. విండోస్ ఓఎస్ ఫోన్లకు ఫేస్‌బుక్ తన సపోర్ట్‌ని విరమించుకోనుంది. ఫేస్‌బుక్‌తో పాటు మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్స్ కూడా విండోస్ ఫోన్లపై పని చేయవు. ఏప్రిల్ 30 నుంచి విండోస్ ఫోన్లపై ఫేస్‌బుక్ యాప్స్ సేవలు బంద్ అవుతున్నాయి. అయితే ఈ సేవలు పొందాలంటే మాత్రం ఓ ఆప్షన్ ఉంది. ఫోన్ యూజర్లు వారి బ్రౌజర్‌లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. విండోస్ ఫోన్ యూజర్లకు ఇప్పటికే సేవల బంద్ గురించి సమాచారం పంపినట్లు తెలుస్తోంది. మైక్రోసాప్ట్ సెక్షన్‌లో ఫ్రీ యాప్స్ కేటగిరిలో ఫేస్‌బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్ టాప్ 3లో ఉంటాయి. అలాగే వాట్సాప్ సేవలు అందిస్తుందా లేదా అనే దానిపట్ల స్పష్టత లేదు. ఇదిలా ఉండగా, 2016 నుంచి మైక్రోసాప్ట్ ఫోన్లను విక్రయించడం నిలిపివేసింది. 2019 డిసెంబర్ నుంచి సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్స్ కూడా నిలిపివేయనుంది. మరికొన్ని వాడుకలో ఉన్న పాపులర్ యాప్స్ కూడా విండోస్ ఫోన్లపై పనిచేయడం లేదు.

Recommended For You