బంఫర్ ఆఫర్..ఎసీలపై 65 శాతం డిస్కౌంట్.

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా సూపర్ కూలింగ్ డేస్ పేరుతో మెగా సమ్మర్ సేల్ ప్రకటించింది. ఇందులో భాగంగా వివిధ ఉత్పత్తులపై 65 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఏప్రిల్ 10 నుంచి మొదలైన ఈసేల్ 14 వరకు అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లయితే 10 శాతం అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేకమైన ధర తగ్గింపు ప్రయోజనాలు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఇకపోతే ఏసీలను తక్కువ ధరకు అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది. ఫ్రిజ్‌లను రూ.6,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ సంస్థ ఎంపిక చేసిన ఉత్పత్తులపై డెబిట్ కార్డు, ఈఎంఐ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ఏసీకి నెలవారీ ఈఎంఐరూ.1,210 నుంచి ప్రారంభమైతే. ఫ్రిజ్ రూ.459 నుంచి ప్రారంభమవుతోంది. పానాసోనిక్ ఏసీలైతే ఇన్‌స్టాలేషన్ పూర్తి ఉచితంగా చేస్తారట. ఇతర కంపెనీలవైతే రూ.499 చెల్లిస్తే సరిపోతుంది. ఇక ఏసీలు ఎక్సేంజ్ ఏమైనా చేసుకోదలిస్తే రూ.6,000 వరకు తగ్గింపు ఉంటుందని తెలిపింది. ఫోన్‌పే యూజర్లకు రూ.250 తక్షణ తగ్గింపు సౌలభ్యం ఉంది. అలాగే 2 నెలల ఎలక్ట్రిసిటీ బిల్లుపై రూ.1,000 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

Recommended For You