మరోసారి సూపర్‌ ఆటతీరును ప్రదర్శించిన చెన్నై జట్టు

చెన్నై జట్టు మరోసారి సూపర్‌ ఆటతీరును ప్రదర్శించింది. రాజస్థాన్‌ రాయల్స్‌ అద్భుత బౌలింగ్‌తో టాపార్డర్‌ వికెట్లను వేగంగా కోల్పోయిన వేళ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ, రాయుడు సమయోచిత బ్యాటింగ్‌తో సీఎస్‌కే కోలుకుంది. దీంతో రాజస్థాన్‌పై 4 వికెట్ల తేడాతో నెగ్గింది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. స్టోక్స్‌, బట్లర్ ఓమాదిరిగా ఆడారు. జడేజా, చాహర్‌, ఠాకూర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో హైడ్రామా నెలకొన్నా.. శాంటర్న్ ఆఖరి బంతికి సిక్సర్ తో సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ధోనీ నిలిచాడు.

Recommended For You