మీరు మరీ.. నెటిజన్స్ కామెంట్స్

సరదా సంతోషాన్ని ఇవ్వాలే కాని విషాదాన్ని తీసుకురాకూడదు. అయినా ఇదేం పిచ్చి.. ఆయనేమో సేఫ్ జోన్లో. నువ్వేమో గాల్లో వేలాడుతూ.. అదీ ఒంటి కాలిమీద. మీ సరదాలు తగలెయ్యా. అక్కడినుంచి పడితే బాడీలో ఏపార్ట్ అయినా పనికొస్తుందా. ఇంక వేరే ఏ ప్లేసూ దొరలేదా బాబు. మీ ముద్దూ ముచ్చట్లకి.. ఆనక వాటిని ఫొటోల్లో బంధించడానికి.

పోనీ.. మీకు బుద్ది లేదు. కనీసం ఆ ఫోటో తీసిన వాడికైనా ఉండాలిగా బుద్ది. చూడ్డానికే భయంగా ఉంది. అసలు ఇలాంటి సాహసం చేయాలని మీకెలా అనిపించింది.. అంటూ ఫోటోని పోస్ట్ చేసిన నిమిషాల్లోనే విమర్శల మీద విమర్శలు గుప్పిస్తూ కామెంట్ల పరంపర మొదలు పెట్టారు నెటిజన్స్.

దానికి.. ఆ ప్రేమికుల జోడీ ఆహా! మేము చేసిన ఈ ప్రయత్నం బాగానే వర్కవుట్ అయింది అంటూ నిదానంగా అసలు విషయాన్ని వివరిస్తూ మొదటి ఫొటో తాలూకూ కంటిన్యూషన్ ఫొటోలు పోస్ట్ చేశారు. పైన బాయ్ ఫ్రెండ్ ఒక స్విమ్మింగ్‌ పూల్లో ‌ఉంటే కింద మరో పూల్ ఉంది. ఒకవేళ పడ్డా అందులోనే పడతానన్న ధైర్యం.. ఆమెని ఈ ఫోటో షూట్ చేయడానికి ప్రేరేపించింది.

అదిచూసిన నెటిజన్స్ అవునా.. భలే భయపెట్టారుగా మమ్మల్ని. ఎనీవే.. ఎంజాయ్ అంటూ ఆ జంటకు విషెస్ చెప్పారు. అమెరికాకు చెందిన కెల్లీ క్యాస్ట్లీ, కోడి అనే జంట వినూత్నంగా ఆలోచించి ఈ ఫోటో షూట్‌ చేసి వాటిని తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అవి ఇలా నెట్టింట సందడి చేస్తున్నాయి.

america-couples1.png

View this post on Instagram

 

Seize the day with a beautiful view from our amazing pool. Thank you @la_la_la_lara for having a good time with us💕 #trulyubud ••••• Get special rate through our website with our promo code : TKJRIG18 thekayonjungleresort.com Resort for Adult Only ••••• The Kayon Jungle Resort Member of @pramanahotels  Managed by @pramanaexperience ••• #trulykayon #kayonubud #kayonresort #kepiturestaurant #pramanahotels #natureview #naturelover #wonderfulindonesia #bestdestinationwedding #honeymoon #romantichotel #explorebali #bali #visitbali #thebaliguideline #balidaily #baligasm #balilife #ubud #thebalibible #balibible #lovetotravel #traveltheworld #wonderfulhotel

A post shared by The Kayon Jungle Resort (@kayonjungleresort) on

 

 

Recommended For You