ఎల్ఐసీ కొత్త పాలసీ.. పిల్లల భవిష్యత్తు కోసం రోజుకు రు. 206 పెట్టుబడి పెడితే రూ.27 లక్షలు..

పిల్లలకు మంచి భవిష్యత్‌ని అందించాలని ప్రతి తల్లీ, తండ్రి కలలు కంటారు. కష్టమంతా వారి బంగారు భవిష్యత్ కోసమే. సంపాదించే ప్రతి రూపాయిని సరైన దారిలో ఇన్వెస్ట్ చేస్తేనే భధ్రతతో పాటు భరోసా ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసీలో పెట్టుబడి పెడితే చింత ఉండదు. పైగా మన పెట్టుబడికి దాదాపు రెట్టింపు డబ్బు మన చేతికి వస్తుంది. ఇది వారి పై చదువులకు లేదా వారి పెళ్లిళ్లకు ఉపయోగపడుతుంది. కనుక ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే మంచిది.

lic

పాలసీ వివరాలకు చూస్తే..
దీని పేరు చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ 832. ఇందులో రోజుకు రూ.206 పెట్టుబడి పెడితే పాలసీ మెచ్యూరిటీ సమయంలో రూ.27 లక్షలు పొందవచ్చు. పాలసీ గడువు 25 ఏళ్లు. ఉదాహరణకు మీ పాపకు ఏడాది వయసు వుంటే ఈ పాలసీ తీసుకుని రోజుకు రూ.206లు కడితే పాపకు 25 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత రూ.27 లక్షలు ఆమె చేతికి వస్తాయి. పాపకు 5 సంవత్సరాలు ఉన్నట్లైతే 20 ఏళ్ల తరువాత మెచ్యూరిటీ డబ్బులు వస్తాయి. అయితే ఈ పాలసీని 0-12 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. పాలసీ ప్రీమియంని ప్రతి నెలా లేదా 3 నెలలు, 6 నెలలు, ఏడాదికి ఒకసారి చెల్లించే వెసులుబాటు ఉంది.

Recommended For You