మంచి మనస్సు చాటుకున్న బన్నీ..కారు ఆపి మరీ..!

allu-arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన మంచి మనస్సు ఏంటో నిరుపించుకున్నారు. అభిమానుల పట్ల తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. తాజాగా అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ మూవీ ఓపెనింగ్ సందర్భంగా ఓ అనుకొని సంఘటన జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ముగించుకొని రోడ్డు మార్గం ద్వారా ఇంటి వెళుతున్న బన్ని ఇద్దరు దివ్యాంగులు తనకు అభివాదం చేస్తూ కనిపించారు. వారిని చూసిన అర్జున్ వెంటనే కారు ఆపి వారిని అప్యాయంగా పలకరించారు. అనంతరం వారితో సెల్ఫీ దిగారు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు హీరోలు అభిమానుల మీద దాడులకు తెగబడుతుంటే ఈ స్టైలి స్టార్ మాత్రం పెద్ద మనుసుతో వ్యహరించారు. ఈ ఫోటోను అల్లు అర్జున్ ఫాన్స్ తెగ షేర్ చేస్తూ..కామెంట్స్‌తో అతనిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Recommended For You