గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశం

kcr-met-governor-narasimhan

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌పై మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరపున రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన అంశాన్ని గవర్నర్‌కు వివరించారు సీఎం కేసీఆర్‌. ఇక పాలనలో కొత్తగా తీసుకురానున్న పలు సంస్కరణలు, రెవెన్యూ, మున్సిపల్‌ చట్టాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

Recommended For You