నలభై రోజులు ఇలా చేయండి… ఆ తరువాత రిజల్ట్ చూడండి

girl

అందంగా లేనా.. అస్సలేం బాలేనా.. అంటే బానే వున్నావు. ఆ బుగ్గలు కాస్త తగ్గితే బ్యూటీఫుల్‌గా ఉంటావు. ఎప్పుడూ అంత సీరియస్‌గా ఉండకపోతే కాస్త నవ్వొచ్చుగా.. నీ అందాన్ని రెట్టింపు చేస్తుంది నీ చిరునవ్వు.. అని అందం మాటెత్తగానే మోముని మరోసారి అద్దంలో చూసుకుంటుంది మగువ. అందమైన శరీరాకృతికే కాదండి.. ముఖారవిందాన్ని ద్విగుణీకృతం చేస్తే ఫేస్ యోగా ఉందని మీకు తెలుసా.. జస్ట్ కూర్చున్న చోటే ఈ ఫేస్ యోగా చేసేయొచ్చు. కంటిన్యూగా ఓ నలభై రోజుల పాటు చేయండి. ఆ తరువాత రిజల్ట్ చూడండి. మీకు మీరే ఎంతందంగా కనిపిస్తారో అద్దంలో చూసుకుంటే.. ఫేస్ ప్యాకులు, క్రీములు గట్రాలాంటివి పక్కన పడేసి ఈ యోగా ట్రై చేయండి. ఆప్టర్ ఫార్టీ డేస్.. వావ్.. సో క్యూట్ అని అనని వారుంటారేమో చూడండి. ఇక ఈ యోగా ఎలా చేయాలో చూస్తే..

* ఫేస్‌యోగాలో ముందుగా బుగ్గల నుండి గాలి నింపి 10 లెక్కబట్టాలి. ఆ తర్వాత బుగ్గలను కుడివైపుకి ఒకసారి, ఎడమవైపుకి ఒకసారి ఉంచాలి.
* రెండు వేళ్లతో ఒక కనుబొమ్మను మెల్లిగా పైకి లాగి దించండి.. అలా రెండు ఐబ్రోస్ చేయాలి. ఇలా అయిదారుసార్లు చేయాలి.
* ఇప్పుడు ‘x’, ‘o’ అనే లెటర్స్‌ని పలకాలి ఓ 10 లెక్కబెట్టాలి.
* ఇప్పుడు రెండు చూపుడు వేళ్లతో పెదవుల చివర్లు పట్టుకుని సాగదీసి వదిలేయాలి. ఇలా అయిదారుసార్లు చేయడం మంచిది.
* ఇప్పుడు పెదవులని మూసి ఎంత వీలైతే అంత నవ్వాలి.. ఇలా 5 సెకన్లు ఉంచాలి.
* తర్వాత చేపలా పెదవులను ఉంచి ఓ 5 నుంచి 10 సెకన్లు ఉండాలి. ఇలా చేయడం వల్ల చీక్స్ దగ్గర ఉండే ఫ్యాట్ కరిగిపోతుంది.
* ముఖం తిప్పకుండా కళ్లను కుడివైపు నుంచి ఎడమవైపుకి చూస్తుండాలి. ఇది ఓ 5సెకన్లు చేయాలి.
* నోటిని ఎడమవైపు తిప్పుతూ నాలిక చిన్నగా బయటపెట్టాలి.
* ఇప్పుడు తలని ఆకాశంవైపు చూస్తు ఓ 10 లెక్కబెట్టాలి.
* డబుల్ చిన్ తగ్గడానికి తలను కుడి, ఎడమవైపుకి పైగా ఉంచాలి.
* ముందు చెప్పుకున్నట్లు ఎంత నవ్వినట్లు చేశామో అలా అంతే కోపం ఉన్నట్లు ముఖ కవళికలను చేయాలి.
ఇలా ప్రతి స్టెప్‌ని రెగ్యులర్‌గా చేయండి. మార్పుని మీరే గమనించండి.

Recommended For You